US Intelligence Leak: ఉక్రెయిన్ యుద్ధంపై ఇంటెలిజెన్స్ సమాచారం లీక్.. 21 ఏళ్ల అమెరికన్ అరెస్టు
US intelligence leak: 21 ఏళ్ల వ్యక్తిని అమెరికా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మిలిటరీకి చెందిన సమాచారాన్ని లీక్ చేసినట్లు ఆ టీనేజర్పై ఆరోపణలు ఉన్నాయి. అతన్ని బోస్టన్ కోర్టులో హాజరుపరచనున్నారు.
బోస్టన్: ఉక్రెయిన్ యుద్ధాని(Ukraine War)కి చెందిన రహస్య అంశాలను లీక్(Intelligence Leak) చేసిన 21 ఏళ్ల జాక్ టెక్సేరియా అనే వ్యక్తిని అమెరికా పోలీసులు అరెస్టు చేశారు. మాసాచుసెట్స్లోని బోస్టన్ కోర్టులో అతన్ని ఇవాళ హాజరుపరచనున్నారు. అమెరికా మిలిటరీ ఇంటెలిజెన్స్ సమాచారం లీక్ కావడం కలకలం రేపుతున్నది. ఈ నేపథ్యంలో దిగ్టన్ పట్టణంలో ఉన్న జాక్(Jack Teixeira)ను ఎఫ్బీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. షార్ట్స్, టీషర్ట్లోనే ఉన్న అతన్ని పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు.
ఎయిర్మాన్గా పనిచేస్తున్న టెక్సేరియా .. మిలిటరీ సమాచారాన్ని ఆన్లైన్లో లీక్ చేశాడు. ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన క్లాసీఫైడ్ సమాచారం ఆన్లైన్ చాట్ గ్రూపులో తొలుత గుర్తించారు. రహస్య సమాచారాన్ని చేరవేసిన కోణంలో అతనిపై అభియోగాన్ని నమోదు చేశారు.
ఉక్రెయిన్ యుద్ధం గురించి అమెరికా చేసిన అంచనాలు, అమెరికా మిత్ర దేశాలకు చెందిన సున్నితమైన రహస్యాలు ఆ లీకేజీలో ఉన్నాయి. ఇంటెలిజెన్స్ సమాచారం లీక్ కావడంతో… అమెరికా అవమానకరంగా ఫీలవుతున్నట్లు తెలుస్తోంది. ఇది జాతీయ భద్రతకు కూడా ప్రమాదం అవుతుందని అంచనా వేస్తోంది.
మాసాచుసెట్స్ నేషనల్ గార్డులో ఉన్న ఇంటెలిజెన్స్ వింగ్లో ఐటీ స్పెషలిస్టుగా ఎయిర్మాన్ టెక్సేరియా పనిచేస్తున్నాడు. అయితే యువకులతో కూడా ఓ ఆన్లైన్ చాట్ రూమ్ను అతను ఓపెన్ చేశాడు. ఆ గ్రూపుతో గత కొన్ని నెలలుగా రహస్య సమాచారాన్ని షేర్ చేశాడు. ఇంటెలిజెన్స్ సమాచారం బయటకు వచ్చిన తర్వాత పెంటగాన్ అధికారులు ఈ కేసులో దర్యాప్తు మొదలుపెట్టారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కస్తాలలో సబ్ స్టేషన్ ముందు రైతుల నిరసన
విద్యుత్ వైరు తెగిపడి పాడి బర్రె మృతి
Crazy Kalyanam | ‘క్రేజీ కళ్యాణం’ రివ్యూ.. అనుపమ, తరుణ్ భాస్కర్ల సినిమా ఎలా ఉంది?
AP News | వైసీపీ మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు.. అధికారంలోకి రావడం ఖాయం, వడ్డీతో కలపి చెల్లిస్తాం
Share Market | లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 413 పాయింట్లు లాభం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

