రాజకీయ సంక్షోభంలో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్.. ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రుల రాజీనామా
Boris Johnson in Crisis | బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ సంక్షోభంలో చిక్కుకున్నారు. ఆయన మంత్రులు సునాక్, సాజిద్ జావిద్ వైదొలిగారు.
Boris Johnson in Crisis | బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ సర్కార్ రాజకీయ సంక్షోభంలో చిక్కుకున్నది. తలెత్తింది. ఆర్థిక మంత్రి రిషి సునాక్, ఆరోగ్యశాఖ మంత్రి సాజిద్ జావిద్ మంగళవారం తమ పదవులకు రాజీనామా చేశారు. ప్రభుత్వం నుంచి వైదొలగడం బాధాకరం అని రిషి సునాక్ తన లేఖలో పేర్కొన్నారు. కానీ, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కొనసాగడం కష్ట సాధ్యం అని తెలిపారు.
ప్రభుత్వం నుంచి ప్రజలు సరైన పాలనను కావాలని కోరుకుంటారు. గతంలో మంత్రిగా ఈ సంగతిని నేను గుర్తించా. శక్తి సామర్థ్యాల ప్రదర్శనకే ప్రస్తుత ప్రమాణాలు పనికి వస్తున్నాయి. అందుకే నేను రాజీనామా చేస్తున్నా` అని రిషి సునాక్ పేర్కొన్నారు. భారత్ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి అల్లుడే రిషి సునాక్. ఒకానొక దశలో బోరిస్ జాన్సన్కు ప్రత్యామ్నాయంగా బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ అవుతారని వార్తలొచ్చాయి.
దేశ ప్రయోజనాలకు అనుగుణంగా సుపరిపాలన అందించడంలో బోరిస్ జాన్సన్ శక్తి సామర్థ్యాలపై తాను నమ్మకం కోల్పోయినట్లు ఆరోగ్యశాఖ మంత్రిగా రాజీనామా చేసిన సాజిద్ జావిద్ తన రాజీనామా లేఖలో తెలిపారు. తన మనస్సాక్షి మేరకు ఈ పదవిలో కొనసాగలేనని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. జాతి ప్రయోజనాలకు అనుగుణంగా పాలన అందించడంలో బోరిస్ జాన్సన్ ఎంపీలు, ప్రజల విశ్వాసం కోల్పోయారన్నారు.
అయినప్పటికీ, ప్రస్తుత పరిస్థితికి విచారం వ్యక్తం చేస్తున్నా.. మీ నాయకత్వంలో ప్రభుత్వంలోనూ, పాలన పరిస్థితుల్లో ఎటువంటి మార్పు రాదని నాకు అర్థమైంది. మీరు నా విశ్వాసాన్ని కోల్పోయారు` అని బోరిస్ జాన్సన్కు రాసిన లేఖలో సాజిద్ జావిద్ స్పష్టం చేశారు. ఇటీవలి కాలంలో బ్రిటన్లో పలు కుంభకోణాలు వెలుగు చూసిన నేపథ్యంలో ఆరోగ్య, ఆర్థిక శాఖల మంత్రులు రాజీనామా చేయడం ప్రాధాన్యం సంతరించుకున్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

