రష్యాకు ఎదురుదెబ్బ… ఉక్రెయిన్ దాడిలో వెయ్యి మంది సైనికులు మృతి
గత 24 గంటల్లో వెయ్యి మందికిపైగా రష్యా సైనికులు మరణించినట్లు ఉక్రెయిన్ రక్షణ మంత్రి తెలిపారు. ఇప్పటి వరకు 71,200 మంది రష్యా సైనికులు చనిపోయినట్లు పేర్కొన్నారు.
మాస్కో: రష్యాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఉక్రెయిన్ మిలిటరీ దాడిలో వెయ్యి మంది రష్యా సైనికులు మరణించారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి దిగిన తర్వాత రష్యా మరోసారి ఇంత పెద్ద సంఖ్యలో సైనికులను కోల్పోయింది. సైన్యంలోకి కొత్తగా రిక్రూట్ చేసుకున్న సైనికులను సరిహద్దుల వద్దకు రష్యా తరలించింది. అయితే కనీస ఆయుధాలు కూడా లేని రష్యా సైనికులపై ఉక్రెయిన్ దళాలు దాడి చేశాయి. దీంతో గత 24 గంటల్లో వెయ్యి మందికిపైగా రష్యా సైనికులు మరణించినట్లు ఉక్రెయిన్ రక్షణ మంత్రి తెలిపారు. ఇప్పటి వరకు 71,200 మంది రష్యా సైనికులు చనిపోయినట్లు పేర్కొన్నారు.
మరోవైపు ఉక్రెయిన్‌పై దాడులను తీవ్రం చేసేందుకు రష్యా ప్రయత్నిస్తున్నది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ నుంచి గోధుమల రవాణా కోసం ఐక్యరాజ్య సమితి (ఐరాస)తో చేసుకున్న ఒప్పందాన్ని రష్యా బ్రేక్ చేసింది. గోధుమలు ఎగుమతి చేసే కారిడార్‌ను రష్యాపై దాడుల కోసం ఉక్రెయిన్ వినియోగిస్తున్నదని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో యూఎన్, టర్కీతో చేసుకున్న ఒప్పందం నుంచి తప్పుకుంటున్నట్లు ఇటీవల వెల్లడించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

