బ్రిటన్‌లో 2300 ఇండియన్ వేరియంట్ కేసులు

లండన్: భారత్‌లో B.1.617 కరోనా వైరస్ వేరియంట్ పెను విలయం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఇలాంటి వేరియంట్ కేసులు ఇప్పుడు బ్రిటన్‌లో నమోదు అవుతున్నాయి. ఇండియాలో బీభత్సం సృష్టించిన B.1.617 వేరియంట్‌కు సంబంధించి.. బ్రిటన్‌లో సుమారు 2300 కేసులు నమోదు అయినట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి మ్యాట్ హాన్కాక్ తెలిపారు. ఎగువ సభ (హౌజ్ ఆఫ్ కామన్స్)లో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఇంగ్లండ్‌లోని బోల్టన్, బ్లాక్బర్న్ ప్రాంతాల్లో ఈ వేరియంట్ కేసులు రెట్టింపు అవుతున్నట్లు కూడా ఆయన తెలిపారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు.
ఇండియన్ వేరియంట్ కేసులను గుర్తించినట్లు స్థానికంగా 86 ప్రాంతాల అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ప్రజలంతా త్వరగా వ్యాక్సిన్లు వేయించుకోవాలని మంత్రి కోరారు. బోల్టన్‌లో ఇండియన్ రకం వైరస్ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయని, కానీ ఆ ప్రాంతవాసుల్లో చాలా మంది ఇంకా టీకాలు వేసుకోలేదని, అక్కడున్నవారు తక్షణమే టీకాలు తీసుకోవాలని మంత్రి మ్యాట్ కోరారు. కొత్త వేరియంట్ కేసులు అధికం అవుతున్న నేపథ్యంలో జూన్ 21వ తేదీ నాటికి ఆంక్షలను ఎత్తివేసే ప్రక్రియ ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నట్లు స్థానికులు భావిస్తున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
“కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో” అనే నినాదంతో రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి కేసీఆర్ పువ్వాడ అజయ్ కుమార్
Actor Abbas | రీఎంట్రీకి సిద్ధమైన ‘ప్రేమదేశం’ హీరో.. విజయ్ దేవరకొండ సినిమాలో అబ్బాస్ పవర్ఫుల్ రోల్!
Diabetes | డయాబెటిస్ చికిత్సలో చిగురిస్తున్న ఆశలు.. నూతన తరహా ఔషధాలను ప్రయోగిస్తున్న నిపుణులు..
PM Modi | డ్రగ్ అడిక్షన్ యువతకు పెను సవాల్.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ..!
Nabha Natesh | గ్లామర్ డోస్ పెంచేసిన నభా నటేష్.. పొట్టి గౌనులో ఇస్మార్ట్ బ్యూటీ అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

