కంపాలా : ఉగాండా ఆర్మీ చీఫ్ జనరల్ ముహుజి కైనెరుగాబా తుర్కియేకు రెండు విస్తుపోయే డిమాండ్లు చేశారు. ఒకటి సోమాలియాలో ఇస్లామిక్ మిలిటెంట్లకు వ్యతిరేకంగా చేసిన పోరాటంలో సైనిక సహాయం చేసినందుకు ఒక బిలియన్ డాలర్లు మిలిటరీ డివిడెండ్‌గా, రెండోది తాను పెండ్లి చేసుకోవడానికి తుర్కియేలోని అత్యంత అందమైన మహిళ కావాలని కోరారు. తన డిమాండ్లను 30 రోజుల్లో తీర్చకపోతే తీవ్రమైన దౌత్య పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు.
తమ దేశ రాజధానిలో తుర్కియే ఎంబసీని మూసి వేస్తానని, టర్కిష్ ఎయిర్‌లైన్స్ తమ గగనతలాన్ని వాడుకోనివ్వబోమని హెచ్చరించారు. కైనెరుగాబా చేసిన ఈ డిమాండ్లపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అయితే ఆయన ఇలాంటి విచిత్రమైన, లింగ వివక్షతో కూడిన డిమాండ్లు చేయడం ఇది రెండోసారి. 2022లో ఇటలీ ప్రధాని మెలోనీ తనను వివాహం చేసుకొంటే ప్రతిఫలంగా ఇటలీకి 100 ఆవులను అందిస్తానని ఆయన ప్రతిపాదించారు.