యూఎఫ్వోలా మేఘాలు.. టర్కీ ప్రజలు థ్రిల్
UFO Like Cloud:కనిపించేది యూఎఫ్వో కాదు.. అవి మేఘాలు.. లెంటిక్యులర్ క్లౌడ్ అంటారు దీన్ని. కానీ యూఎఫ్వోను తలపిస్తున్న ఆ మబ్బుల్ని చూపి టర్కీ జనం థ్రిల్ అవుతున్నారు.
ఇస్తాంబుల్: టర్కీలో మేఘాలు అక్కడ ప్రజల్ని థ్రిల్ చేశాయి. బుర్సా పట్టణంలో యూఎఫ్వో(అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్) తరహాలో మేఘాలు అల్లుకున్నాయి. దీంతో అక్కడ ప్రజలు సంబరమాశ్చర్యంలో తేలిపోయారు. దాదాపు గంట సేపు ఆ మబ్బులు యూఎఫ్వో తరహాలో ఉండిపోయాయి. ఆకాశంలో కనిపించిన ఆ అద్భుతాన్ని స్థానికులు తమ సెల్ఫోన్లలో బంధించారు.
సూర్యోదయం సమయంలో మేఘాలు యూఎఫ్వో తరహాలో దర్శనమిచ్చాయి. టర్కీ శాస్త్రవేత్తలు ఆ అద్భుతాన్ని లెంటిక్యులర్ మేఘాలుగా తేల్చారు. కంటి అద్దాల తరహాలో ఆ మేఘం ఏర్పడినట్లు పేర్కొన్నారు. కానీ ఇంటర్నెట్లో మాత్రం అదో యూఎఫ్వో అన్నట్లు యూజర్లు రియాక్ట్ అయ్యారు. యూఎఫ్వో మేఘానికి చెందిన వీడియో ఒకటి వైరల్ కూడా అవుతోంది.
సాధారాణంగా లెంటిక్యులర్ క్లౌడ్లు భూమికి సుమారు 2వేల నుంచి 5 వేల మీటర్ల ఎత్తులో ఏర్పడుతాయి. శీతాకాలంలో కొండలు, పర్వత ప్రాంతాల్లో బలమైన గాలుల్లో జరిగే మార్పుల వల్ల లెంటిక్యులర్ మేఘాలు ఏర్పడుతాయని భావిస్తున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

