Plane Crash | బ్రిటిష్ కొలంబియాలో కుప్పకూలిన విమానం.. ఇద్దరు భారతీయ ట్రైనీ పైలెట్లు దుర్మరణం
కెనడాలోని (Canada) బ్రిటిష్ కొలంబియాలో (British Columbia) ఓ తేలికపాటి విమానం కుప్పకూలింది (Plane Crash). దీంతో భారత్కు చెందిన ఇద్దరు ట్రైనీ పైలెట్లు సహా ముగ్గురు మరణించారు.
బ్రిటిష్ కొలంబియా: కెనడాలోని (Canada) బ్రిటిష్ కొలంబియాలో (British Columbia) ఓ తేలికపాటి విమానం కుప్పకూలింది (Plane Crash). దీంతో భారత్కు చెందిన ఇద్దరు ట్రైనీ పైలెట్లు సహా ముగ్గురు మరణించారు. పీఏ-34 సెనెకా అనే డబుల్ ఇంజిన్ లైట్ ఎయిర్క్రాఫ్ట్ వాంకోవర్కు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిల్లీవాక్ సమీపంలోని ఓ హోటల్ వద్ద కూలిపోయిందని అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని చెప్పారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. మృతుల్లో ఇద్దరు భారతీయ ట్రెయినీలు ఉన్నారని, వారిని అభయ్ గద్రూ (Abhay Gadroo), యష్ విజయ్ రాముగదేగా (Yash Vijay Ramugade) గుర్తించామన్నారు. వారు ముంబైకి చెందినవారని తెలిపారు.

కాగా, ఆస్ట్రేలియాలోని క్వీన్ బెయాన్ పట్టణం సమీపంలో జరిగిన విమాన ప్రమాదంలో నలుగురు మరణించారు. కాన్బెర్రా నగరం నుంచి బయలుదేరిన విమానం క్వీన్ బెయాన్ పట్టణ సమీపంలో కూలిపోయింది. అనంతరం మంటల్లో చిక్కుకుపోయింది. దీంతో విమానంలో ఉన్న పైలెట్తోపాటు ముగ్గురు పిల్లలు మరణించారని పోలీసులు తెలిపారు. ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియలేదని, దీనిపై ఏవియేషన్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు.

Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

