helicopter crash: అమెరికాలో కూలిన ఆర్మీ హెలికాప్టర్లు.. 9 మంది మృతి
helicopters crash: అమెరికాలో రెండు ఆర్మీ హెలికాప్టర్లు కూలిన ఘటనలో 9 మంది మృతిచెందారు. అయితే శిక్షణలో ఉన్న హెలికాప్టర్లు గాలిలో ఢీకొన్నాయా లేదా అన్న అంశంపై ఇంకా స్పష్టత లేదు. కెంటకీలోని ఫోర్ట్ క్యాంప్‌బెల్ మిలిటరీ బేస్ వద్ద ప్రమాదం జరిగింది.
కెంటకీ: అమెరికాలో రెండు ఆర్మీ హెలికాప్టర్లు(army helicopters) ఢీకొని కూలిన ఘటనలో పలువురు మృతిచెందారు. కెంటకీ(kentuky)లోని ఫోర్ట్ క్యాంప్‌బెల్ మిలిటరీ బేస్‌లో ఈ ఘటన జరిగింది. రెండు బ్లాక్‌హాక్(blackhawk) హెలికాప్టర్లు కూలిన ఘటనలో కనీసం 9 మంది మృతిచెంది ఉంటారని అంచనా వేస్తున్నారు. స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 9 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ట్రిగ్ కౌంటీ ఏరియాలో ప్రమాదం జరిగినట్లు అధికారులు చెప్పారు.
రొటీన్ శిక్షణ(routine training) సమయంలో హెచ్‌హెచ్60 బ్లాక్‌హాక్ హెలికాప్టర్లు క్రాష్ అయినట్లు అమెరికా ఆర్మీ ప్రతినిధి తెలిపారు. రెండు హెలికాప్టర్లు ఢీకొన్నాయా అని అడిగిన ప్రశ్నకు.. అధికారి బదులిస్తూ ఇప్పుడు ఆ విషయాన్ని చెప్పలేమన్నారు. ఈ ప్రమాదం పట్ల దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

