Trump @ NFT Collection | వావ్ డొనాల్డ్ ట్రంప్..! సూపర్ హీరో, ఆస్ట్రోనాట్‌గా దర్శనం
Trump @ NFT Collection | అమెరికా మాజీ అధ్యక్షుడు కొత్త రకం డిజిటల్ కార్డులకు తెరలేపారు. వివిధ ఆకారాల్లో తన ఫొటోలను ముద్రించిన కార్డులను ఎక్కువగా సేకరించిన వారికి సర్పరైజ్ ఇవ్వనున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఈ మొత్తాన్ని తన వద్దే ఉంచుకుంటానని స్పష్టం చేశారు.
Trump @ NFT Collection | అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన స్వంత డిజిటల్ కార్డులను విడుదల చేశారు. వీటిలో సూపర్ హీరో, వ్యోమగామి వేషధారణలో ట్రంప్ కనిపిస్తున్నారు. ఈ కార్డుల ధర 99 డాలర్లు అంటే మన కరెన్సీలో 8 వేల రూపాయలు. వీటిని విక్రయించేందుకు, కస్టమర్లను ఆకర్షించేందుకు ట్రంప్ రకరకాల ఆఫర్లు ఇస్తున్నారు. అయితే, ట్రంప్ పనికి చాలా మంది చైల్డీష్ యాక్ట్ అని విమర్శిస్తుండగా.. ఇది ముమ్మాటికీ 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల పబ్లిసిటీ స్టంట్ అని ఇంకొందరు కొట్టిపారేస్తుండటం విశేషం.
డొనాల్డ్ ట్రంప్ డిజిటల్ ట్రేడింగ్ కార్డ్‌ల పేరుతో ఉన్న ఎన్ఎఫ్టీ కలెక్షన్లు మార్కెట్లోకి వచ్చాయి. ఈ కార్డులపై ట్రంప్ సూపర్ హీరో, వ్యోమగామి, ఓల్డ్ వెస్ట్ షెరీఫ్, నాస్కార్ డ్రైవర్‌తో పాటు ఇతర వ్యక్తుల వేషధారణలో కనిపిస్తున్నారు. గత ఏడాది స్థాపించిన సోషల్ మీడియా సైట్ ట్రూత్ సోషల్ ద్వారా ఈ ప్రకటన జారీ అయింది. ఎక్కువ కార్డులు కొని సేకరించే వ్యక్తులతో కలుస్తామని, వీడియో కాల్లు, ఆటోగ్రాఫ్‌లు, గోల్ఫ్ ఆడతామని.. ఇలా పలువురితో ట్రంప్ మాట్లాడుతున్నారు. 45 కార్డులను కొనుగోలు చేసే వ్యక్తులకు తన సౌత్ ఫ్లోరిడా రిసార్ట్‌లోకి ఎంట్రీ ఉంటుందని, పార్టీ పొందుతారని ట్రంప్ చెప్పారు. 45,000 ఫాంటసీ ఎన్ఎఫ్టీ టోకెన్లను 99 అమెరికన్ డాలర్లతో ముద్రించారు. వీటిని ఈథర్ లేదా ఫియట్ కరెన్సీతో కొనుగోలు చేయవచ్చు. ఈ డిజిటల్ కార్డుల అమ్మకం ద్వారా వచ్చే డబ్బును ఎన్నికల ప్రచారానికి వినియోగించనని ట్రంప్ స్పష్టం చేశారు.
ఇది ట్రంప్ చైల్డీష్ యాక్ట్..
ట్రంప్ విడుదల చేసిన డిజిటల్ కార్డులను ప్రజలు ఎగతాళి చేస్తున్నారు. చాలా మంది చైల్డీష్ యాక్ట్ అంటూ తీవ్రంగా విమర్శిస్తున్నారు. అమెరికా అధ్యక్ష పదవికి మరోసారి పోటీ చేయనున్నట్టు ప్రకటించిన ట్రంప్‌కు మీడియా కవరేజీ ఇవ్వకపోవడంతో దీనిని పబ్లిసిటీ స్టంట్ అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | హర్మన్‌ప్రీత్, దీప్తి శర్మ శతకాల మోత.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
Vehicle Emissions | వాహన ఉద్గారాలపై నియంత్రణ ఎందుకు.. ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం ఉంటుంది..?
Saudi Arabia | సౌదీ అరేబియాపై డ్రోన్లు, మిస్సైల్స్ దాడి.. ఆ వీడియోలు షేర్ చేయొద్దంటూ భారతీయులకు వార్నింగ్
Harish Rao | దివ్యాంగుల సంస్థకు రెండేళ్లుగా రూ.16 లక్షల బిల్లులు పెండింగ్.. హరీశ్‌రావు ఆగ్రహం
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

