Train torched | రైలుకు నిప్పుపెట్టిన ఆందోళనకారులు.. బంగ్లాదేశ్‌లో నలుగురు సజీవదహనం
Train torched | బంగ్లాదేశ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న కొందరు ఆందోళనకారులు ఉన్మాదుల్లా వ్యవహరించారు. విమానాశ్రయం నుంచి ఢాకా నగరంలోకి వెళ్తున్న రైలుకు నిప్పుపెట్టారు. దాంతో రైలు మూడు బోగీలకు మంటలు అంటుకున్నాయి.
ఢాకా: బంగ్లాదేశ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న కొందరు ఆందోళనకారులు ఉన్మాదుల్లా వ్యవహరించారు. విమానాశ్రయం నుంచి ఢాకా నగరంలోకి వెళ్తున్న రైలుకు నిప్పుపెట్టారు. దాంతో రైలు మూడు బోగీలకు మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో ఒక మహిళ, మైనర్ అయిన కుమారుడితోపాటు మొత్తం నలుగురు సజీవదహనం అయ్యారు.
బంగ్లాదేశ్‌లో జనవరి 7న పార్లమెంటు ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో పోలింగ్‌లో అవకతవకలు జరగకుండా ఏ పార్టీకీ సంబంధం లేని ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ప్రధాన ప్రతిపక్షమైన ‘బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ)’ పార్టీ డిమాండ్ చేసింది. బీఎన్పీ డిమాండును పాలక అవామీ లీగ్ తిరస్కరించింది.
దాంతో ఆగ్రహించిన బీఎన్పీ ఈ ఎన్నికల బహిష్కరణ కోసం ఉద్యమిస్తోంది. బీఎన్పీకి చెందిన ఆందోళనకారులు పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చిన నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎయిర్‌పోర్టు నుంచి ఢాకా సిటీలోకి వెళ్తున్న రైలుకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

