Lovers Protest | కొత్త పెండ్లి కొడుక్కు ప్రియురాళ్ల ఝలక్.. వివాహ వేదిక ముందే యువతుల నిరసన..!
సరిగ్గా పెండ్లి కొడుకు, పెండ్లి కూతురు మెడలో తాళి కట్టే సమయానికి ఆ యువతి ఆపండి.. అనే మాటకు కొనసాగింపుగా ఆపండి.. ఆపండి.. ఆపండి.. అనే ప్రతిధ్వని వినిపిస్తుంది. ఆ తర్వాత పెండ్లి కొడుకు బండారం బయటపడి వివాహం అర్ధాంతరంగా ఆగిపోతుంది. అయితే..
బీజింగ్: పీటల మీద పెండ్లి ఆగిపోయిందనే మాట మనం తరచూ వింటుంటాం. నిజం జీవితంలో ఇలాంటి ఘటనలు అరుదుగా కనిపించినా, సినిమాల్లో మాత్రం చాలాసార్లు చూసి ఉంటాం. వైభవంగా వివాహ వేడుక జరుగుతుండగా సరిగ్గా పెండ్లి కొడుకు, పెండ్లి కూతురు మెడలో తాళి కట్టే సమయానికి ఓ యువతి ఆపండి.. అనే మాటకు కొనసాగింపుగా ఆపండి.. ఆపండి.. ఆపండి.. అనే ప్రతిధ్వని వినిపిస్తుంది. ఆ తర్వాత పెండ్లి కొడుకు బండారం బయటపడి వివాహం అర్ధాంతరంగా ఆగిపోతుంది.
అయితే, సినిమాల్లో తరచుగా కనిపించే ఈ తరహా ఘటనకు పదింతలు రెట్టింపయిన ఘటన తాజాగా చైనాలోని యునాన్ చోటుచేసుకుంది. ఘనంగా వివాహ వేడుక మొదలైంది. బంధుమిత్రుల సందడితో ఆ పరిసరాలన్నీ కళకళలాడుతున్నాయి. సరిగ్గా అప్పుడే ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు ఏకంగా కొంతమంది యువతుల గ్రూపే అక్కడికి చేరుకుంది.

రాగానే తమ వెంట తెచ్చుకున్న భారీ ఎరుపు రంగు బ్యానర్‌ను ప్రదర్శించింది. దానిపై ‘తాము పెండ్లి కొడుకు చెన్ మాజీ ప్రియురాళ్లం. ఈ రోజు మేం ఈ వివాహాన్ని చెడగొడుతాం’ అని రాసి ఉంది. ఇది చూసి బంధువులు ఆ మగువలను ఆరా తీయడం మొదలుపెట్టారు. వారు చెన్ తమను మోసం చేశాడని చెప్పడంతో విషయం కాసేపట్లో పెండ్లికి హాజరైన అందరికీ తెలిసిపోయింది. దాంతో పెండ్లి కూతురు, ఆమె పేరెంట్స్ ఆగ్రహంతో ఊగిపోయారు.
కథ ఏందంటూ పెండ్లి కొడుకును నిలదీశారు. దాంతో అతడు అబద్ధం చెప్పకుండా నిజం ఒప్పుకున్నాడు. వాళ్లంతా తన మాజీ ప్రియురాళ్లేనని, టీనేజ్‌లో తాను కొంచెం కొంటెగా ఉండేవాడినని, ఆ క్రమంలో చాలా మంది అమ్మాయిలను బాధపెట్టానని, ఇప్పుడు పూర్తిగా మారిపోయానని చెప్పాడు. నిరసనకు దిగిన తన మాజీ ప్రియురాళ్లను క్షమాపణ కోరాడు.
పెండ్లి కొడుకు నిజాయితీకి పెండ్లి కూతురు, ఆమె పేరెంట్స్ ఫిదా అయ్యారు. క్షమాపణ కోరడంతో అతని మాజీ ప్రియురాళ్లలో కూడా కోపం చల్లారింది. దాంతో ఏ అడ్డంకి లేకుండా పెండ్లి జరిగిపోయింది. కాగా, దీనిపై రకరకాల కామెంట్లు వస్తున్నాయి. చిరుతపులి మచ్చలు మారవని పెండ్లి కొడుకును ఉద్దేశించి ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. పెళ్లి కూతరు స్థానంలో తానుంటే వెంటనే విడాకులు ఇచ్చేదాన్నని ఓ యువతి కామెంట్ పెట్టింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- bride
- china
- Girl Friends
- groom
RELATED ARTICLES
తాజా వార్తలు
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
Solar-Powered Cart | వీధి వ్యాపారుల కోసం సౌర శక్తి బండి.. ఆవిష్కరించిన ఐఐటీ ఖరగ్‌పూర్
Leap Hour | లీప్ సెకండ్‌కు స్వస్తి.. మూడు దశాబ్దాల చర్చకు తెర
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

