కాలిఫోర్నియా: కాలిఫోర్నియాలోని 45 ఏళ్ల సాఫ్ట్వేర్ బిలియనీర్ బ్రయాన్ జాన్సన్ తనని తాను 18 ఏళ్ల నవ యువకుడిగా మార్చుకునేందుకు అతి ఖరీదైన చికిత్సను తీసుకుంటున్నాడు. దీని నిమిత్తం సంవత్సరానికి 2 మిలియన్ డాలర్లు (సుమారు రూ.16 కోట్లు) ఖర్చుతో తన మీద డాక్టర్లతో ప్రయోగాలు చేయించుకున్నాడు.
కేవలం బాహ్యరూపం మాత్రమే యువకుడిగా కాకుండా గుండె, ఊపిరితిత్తులు, చర్మం, కళ్లు, కిడ్నీలు తదితర ముఖ్య అవయావాలు సైతం ఆ వయసువారిలో ఉండే విధంగా తయారవ్వడానికి 30 మంది డాక్టర్ల బృందంతో ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నాడు.