Iran Embassy | ఆ పిల్లలను కూడా వాళ్ల తల్లులు మీరు కన్నట్టే కన్నారు.. వైట్‌హౌస్ ప్రెస్ సెక్రెటరీ సోషల్ మీడియా పోస్టుకు ఇరాన్ ఎంబసీ రెస్పాన్స్
Iran Embassy | వైట్‌హౌస్ (White House) ప్రెస్ సెక్రెటరీ (Press Secretary) కరోలిన్ లీవిట్ (Karoline Leavitt) ఇటీవల ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా పంచుకొని ఆనందం వ్యక్తంచేశారు. చిన్నారికి వివియానా అని పేరు పెట్టినట్లు వెల్లడించారు. లీవిట్ పోస్ట్‌పై అమెరికాలోని ఇరాన్ ఎంబసీ (Iran Embassy) స్పందిస్తూ శుభాకాంక్షలు తెలిపింది.
Iran Embassy : వైట్‌హౌస్ (White House) ప్రెస్ సెక్రెటరీ (Press Secretary) కరోలిన్ లీవిట్ (Karoline Leavitt) ఇటీవల ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా పంచుకొని ఆనందం వ్యక్తంచేశారు. చిన్నారికి వివియానా అని పేరు పెట్టినట్లు వెల్లడించారు. లీవిట్ పోస్ట్‌పై అమెరికాలోని ఇరాన్ ఎంబసీ (Iran Embassy) స్పందిస్తూ శుభాకాంక్షలు తెలిపింది. అదే సమయంలో ఫిబ్రవరి 28న మినాబ్‌లోని ఒక పాఠశాలపై అమెరికా చేసిన దాడిలో 168 మందికిపైగా విద్యార్థులు మరణించారు.
‘పిల్లలు అమాయకులు వారికి ప్రేమించడం తప్ప మరేమీ తెలియదు. మినాబ్‌లోని పాఠశాలలో మీ బాస్ హత్య చేసిన పిల్లలు కూడా మీలాంటి తల్లులు నవ మాసాలు మోసి కన్నవారే కదా.. మీరు మీ బిడ్డను ముద్దు పెట్టుకునే ముందు ఆ తల్లుల గురించి ఒకసారి ఆలోచించండి’ అని ఇరాన్ ఎంబసీ రాసుకొచ్చింది. ఇరాన్‌పై ఇజ్రాయెల్-అమెరికా తొలిరోజు చేసిన దాడుల్లో మినాబ్ నగరంలోని ఓ ప్రాథమిక పాఠశాలను తోమహాక్ క్షిపణి తాకింది. ఆ ఘటనలో 160 మందికి పైగా చిన్నారులు, 14 మంది టీచర్లు ప్రాణాలు కోల్పోయారు.
ఆ దుర్ఘటన అనంతరం సామూహిక సమాధులు తవ్వి వారందరినీ ఒకే దగ్గర పూడ్చిపెట్టిన దృశ్యాలను ఇరాన్ అధికారులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనిపై అప్పట్లో కరోలిన్ లీవిట్ మాట్లాడుతూ.. అమెరికా ఎప్పుడూ పౌరులను లక్ష్యంగా చేసుకోదని అన్నారు. ఈ విషయంపై తమ యుద్ధ విభాగం దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Farmers | సాగు నీటి కోసం రెండు గ్రామాల రైతుల వాగ్వాదం.. వీడియో
Prince William: ప్రిన్స్ విలియమ్‌తో కలిసి క్రికెట్ ఆడిన గంగూలీ, రహానే
‘ఉప సర్పంచుల చెక్ పవర్‌పై ఆంక్షలు ఎత్తివేయాలి’
Actor Brahmaji | ‘ప్రొటెస్ట్ అనేది కొత్త వృత్తి’.. నటుడు బ్రహ్మాజీ వివాదాస్పద పోస్ట్.. నెటిజన్ల ఆగ్రహం!
రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలి : మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

