UN Secretary General: ముంచుకొస్తున్న మరో యుద్ధం.. వార్నింగ్ ఇచ్చిన యూఎన్ సెక్రటరీ జనరల్
UN Secretary General: మరో యుద్ధం ముంచుకొస్తున్నట్లు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ తెలిపారు. ఇజ్రాయిల్, హిజ్బుల్లా మధ్య ముదురుతున్న ఘర్షణ.. మరో ప్రపంచ యుద్ధానికి దారి తీసే అవకాశాలు ఉన్నట్లు ఆయన హెచ్చరించారు.
న్యూయార్క్: మరో సంక్షోభం దిశగా ప్రపంచ వెళ్తోందని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి(UN Secretary General) ఆంటోనియో గుటెర్రెస్ తెలిపారు. ఇజ్రాయిల్, హిజ్బుల్లా మధ్య ముదురుతున్న ఘర్షణ.. మరో ప్రపంచ యుద్ధానికి దారి తీసే అవకాశాలు ఉన్నట్లు ఆయన హెచ్చరించారు. శుక్రవారం ఈ అంశం గురించి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. కొన్ని రోజుల క్రితం లెబనాన్పై ఇజ్రాయిల్ దాడి చేసిన ఘటనలో హిజ్బుల్లా సీనియర్ కమాండర్ హజ్ సామి తలేబ్ అబ్దుల్లా హతమయ్యాడు. ఈ నేపథ్యంలో షియా మిలిటరీ గ్రూపునకు చెందిన అధినేత హసన్ నస్రల్లా ఓ వార్నింగ్ ఇచ్చాడు. వెస్ట్ జెరుసలామ్లో పూర్తి స్థాయిలో యుద్ధానికి దిగనున్నట్లు నస్రల్లా వార్నింగ్ ఇచ్చిన సందర్భంగా యూఎన్ సెక్రటరీ జనరల్ స్పందించారు.
ఓ మొండి నిర్ణయం, ఓ తప్పుడు అంచనా.. మరో భారీ విపత్తును సృష్టిస్తుందని, అది సరిహద్దుల్ని దాటేస్తుందని, ఊహించని రీతికి వెళ్తుందని యూఎన్ ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ తెలిపారు. లెబనాన్ను మరో గాజాగా చూడాలన్న కాంక్ష ప్రపంచానికి లేదన్నారు. రెండు దేశాలు శాంతి ప్రక్రియ చేపట్టాలని ఆయన ఇరు వర్గాలను కోరారు. లెబనాన్, ఇజ్రాయిల్ మధ్య జరుగుతున్న ఘర్షణకు మిలిటరీ పరిష్కారం కుదరదన్నారు. ఇటీవల ఇజ్రాయిల్, హిజ్బుల్లా .. అనేక సార్లు రాకెట్ దాడులకు పాల్పడ్డాయి. దీని వల్ల 53 వేల మంది ఇజ్రాయిలీలు, లక్షల మంది లెబనీస్లు ఇండ్లు విడిచి వెళ్లారన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

