అమెరికాలో కాల్పుల మోత.. యువకుడు మృతి
వాషింగ్టన్ : అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల మోతమోగింది. వాష్టింగన్ డీసీలోని 14వ, యూస్ట్రీట్‌లో కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఓ యువకుడు మృతి చెందాడు. ఓ పోలీస్ అధికారి సహా ముగ్గురు గాయపడ్డారని అధికారులు తెలిపారు. వైట్ హౌస్‌కు రెండు మైళ్లదూరంలో యూ స్ట్రీట్ నార్త్‌వెస్ట్‌లో ఓ సంగీత కచేరి కార్యక్రమంలో కాల్పులు జరిగాయని పోలీసులు తెలిపారు. కాల్పుల నేపథ్యంలో ఆ ప్రాంతం వైపుగా ఎవరూ వెళ్లొద్దని సూచించారు. అయితే, కాల్పులకు కారణాలు తెలియరాలేదు. ఇటీవల కాలంలో అమెరికాలో వరుసగా కాల్పుల ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.
మే 24న టెక్సాస్‌లోని రాబ్ ఎలిమెంటరీ స్కూల్లో జరిగిన కాల్పుల్లో 19 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఫ్లోరిడాలోని పార్క్‌ల్యాండ్‌లో 2018లో మార్జోరీ స్టోన్‌మ్యాన్ డగ్లస్ హైస్కూల్ కాల్పుల తర్వాత అత్యంత విషాదకరమైన సంఘటన. అప్పటి దాడిలో 17 మంది మరణించారు. మే 31న న్యూ ఓర్లీన్స్‌లోని హైస్కూల్ గ్రాడ్యుయేషన్ వేడుకల్లో కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. ఇద్దరు గాయపడ్డారు. ఈ నెల 1న ఓక్లహోమాలో ఆసుపత్రి క్యాంపస్‌లో జరిగిన కాల్పుల ఘటనలో నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. అగ్రరాజ్యంలో వరుసగా జరుతున్న కాల్పుల ఘటనలతో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | వైసీపీ మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు.. అధికారంలోకి రావడం ఖాయం, అప్పుతో కలసి చెల్లిస్తాం
Share Market | లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 413 పాయింట్లు లాభం
Narnia | | హాలీవుడ్ విజువల్ ఫీస్ట్ ‘నార్నియా’ ట్రైలర్ వచ్చేసింది.!
Meerut | భర్తను చంపిన భార్య, ఆమె ప్రియుడికి మరణశిక్ష.. హత్య చేసి పాముకాటుగా నమ్మించిన భార్య
School Shooting: అమెరికా స్కూల్లో కాల్పుల ఘటన.. ముగ్గురు చిన్నారులు మృతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

