Tariffs | భారత్‌పై 100శాతం సుంకాలు.. 500% నుంచి తగ్గించిన అమెరికా
రష్యా -ఉక్రెయిన్ యుద్ధం ముగించే దిశగా అమెరికా తీసుకొచ్చిన బిల్లులో కీలక మార్పులు చేసింది. ఈ ఆంక్షల బిల్లులో రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై విధించే సుంకాలను 500 % నుంచి 100 శాతానికి తగ్గించారు.
- 500% నుంచి తగ్గించిన అమెరికా
- చట్టసభ సభ్యుల నుంచి మద్దతు
న్యూయార్క్: రష్యా -ఉక్రెయిన్ యుద్ధం ముగించే దిశగా అమెరికా తీసుకొచ్చిన బిల్లులో కీలక మార్పులు చేసింది. ఈ ఆంక్షల బిల్లులో రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై విధించే సుంకాలను 500 % నుంచి 100 శాతానికి తగ్గించారు. రష్యా నుంచి అత్యధికంగా ముడిచమురు కొనుగోలు చేస్తున్న చైనా, ఇండియా, స్లోవేకియా, హంగేరి, అజర్బైజాన్ దేశాలను లక్ష్యంగా చేసుకుని ఈ బిల్లును తీసుకొచ్చారు. దివంగత సెనెటర్ లిండ్సే గ్రాహమ్ ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు ఇప్పుడు అధికార, ప్రతిపక్ష సభ్యుల నుంచి మద్దతు లభించింది.
ఆ దేశాలకూ ఊరట..
ఈ బిల్లు అమల్లోకి వస్తే రష్యా నుంచి ముడిచమురు కొంటున్న ఐదు దేశాలతో పాటు.. 15శాతం లేదా అంతకంటే తక్కువ సహజవాయువు కొంటున్న బెల్జియం, జపాన్, ఫ్రాన్స్, చైనా, హంగేరి లాంటి దేశాలకూ ఊరట లభించనుంది. రష్యా నుంచి ఇండియాతో పాటు చైనా లాంటి దేశాలు ముడిచమురును కొనుగోలు చేస్తే ఆ దేశం ఆర్థికంగా బలపడి ఉక్రెయిన్‌పై యుద్ధం కొనసాగిస్తోందని అమెరికా ఆరోపిస్తోంది. అందులో భాగంగానే గతంలో 500 శాతం సుంకాలు విధించాలని తీసుకొచ్చిన ఈ బిల్లును.. అమెరికా జాతీయ ప్రయోజనాల కోసం 100 శాతానికి తగ్గించింది. ఈ భారీ సుంకాల వల్ల రష్యా నుంచి భారత్, చైనా లాంటి దేశాలు ముడి చమురు దిగుమతులను తగ్గించాలన్నదే తమ లక్ష్యం అని అమెరికా చెబుతోంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- America
- china
- India
- purchasing oil
RELATED ARTICLES
తాజా వార్తలు
Bengaluru Techie’s Kidnap | టెక్కీ కిడ్నాప్ కేసులో 11 మంది అరెస్ట్.. అతడు అత్యాచారానికి పాల్పడినట్లు కిడ్నాపర్ మహిళ ఫిర్యాదు
Tirumala | తిరుమలలో నీటి ఎద్దడి రాకుండా పటిష్ట చర్యలు.. 150 రోజులకు సరిపడా నీటి నిల్వలు : టీటీడీ
Water Tanker | హైదరాబాద్ రోడ్లపై.. వాటర్ ట్యాంకర్లో నుంచి వృధాగా పోతున్న నీళ్లు.. వీడియో
Case Register | రైస్‌మిల్‌లో రూ.13.77 కోట్ల సీఎంఆర్ ధాన్యం మాయం.. మిల్లు భాగస్వాములపై కేసు నమోదు
Premayanam | ఓటీటీలో అదరగొడుతున్న ‘ప్రేమాయణం’ వెబ్ సిరీస్.. ఆకట్టుకుంటున్న బ్యూటిఫుల్ లవ్‌స్టోరీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

