తాలిబన్ల పైశాచికానందం.. సంగీత వాయిద్యానికి నిప్పు, విలపించిన సంగీతకారుడు

కాబూల్: తాలిబన్లు ఏ మాత్రం మారలేదన్నదానికి ఈ ఘటన ఉదాహరణగా నిలుస్తున్నది. ఒక సంగీతకారుడ్ని కొట్టి అతడి వాయిద్య పరికరాన్ని ధ్వంసం చేసి నిప్పుపెట్టారు. మంటల్లో కాలిపోతున్నవాయిద్య పరికరాన్ని చూసి ఒకవైపు బాధతో ఆ సంగీతకారుడు విలపిస్తుండగా, తుపాకులు ధరించిన తాలిబన్లు మాత్రం దీనిని చూసి పైశాచిక ఆనందం పొందారు. నవ్వుతూ తమ మొబైల్లో వీడియోలు రికార్డ్ చేశారు. ఆఫ్ఘనిస్థాన్‌లోని పాక్టియా ప్రావిన్స్‌లో ఈ ఘటన జరిగింది. అబ్దుల్‌హక్ ఒమెరి అనే జర్నలిస్ట్ ఈ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేయగా వైరల్ అయ్యింది.
గత ఏడాది ఆగస్ట్‌లో ఆఫ్ఘనిస్థాన్‌ను మరోసారి తమ నియంత్రంలోకి తెచ్చుకున్న తాలిబన్లు మళ్లీ ఆటవిక పాలన సాగిస్తున్నారు. ఇస్లామిక్ రాజ్యంగా ప్రకటించిన తాలిబన్లు షరియా చట్టం పేరుతో ఆ దేశ ప్రజలు, ప్రత్యేకించి మహిళలపై కఠిన ఆంక్షలు విధించారు. వాహనాలు, వివాహా వేడుకల్లో మ్యూజిక్‌ను నిషేధించారు. పలు సంగీత వాయిద్యాలు, టీవీలను కూడా గతంలో ధ్వంసం చేశారు. పురుషులు, స్త్రీలు వేర్వేరు వేదికలలో వివాహాలు జరుపుకోవాలని ఆదేశించారు.
Video : Taliban burn musician's musical instrument as local musicians weeps. This incident happened in #ZazaiArub District #Paktia Province #Afghanistan . pic.twitter.com/zzCp0POeKl
— Abdulhaq Omeri (@AbdulhaqOmeri) January 15, 2022
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

