బలవంతపు వివాహాలపై తాలిబన్ల నిషేధం

కాబూల్, డిసెంబర్ 3: అఫ్గానిస్థాన్లో మహిళలపై పలువిధాల ఆంక్షలు విధిస్తున్న తాలిబన్లు తాజాగా వారికి అనుకూలమైన ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశంలో మహిళలకు బలవంతంగా వివాహాలు చేయడాన్ని నిషేధిస్తూ తాలిబన్ ప్రభుత్వం శుక్రవారం ఆదేశాలు జారీచేసింది. అఫ్గాన్లో తమ ప్రభుత్వాన్ని అభివృద్ధి చెందిన దేశాలతో గుర్తింపజేసుకోవడంతో పాటు ఆయా దేశాల నుంచి మునుపటి విధంగా ఆర్థిక సాయాన్ని పొందే ఎత్తుగడలో భాగంగా తాలిబన్ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం కనిపిస్తున్నదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే తాలిబన్లు జారీచేసిన ఆదేశాల్లో వివాహానికి కనీస వయసును పేర్కొనలేదు. అంతుకుముందు ఇది 16 ఏండ్లుగా ఉండేది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

