తక్కువ ధరకే వయాగ్రా.. పురుషుల్లో తగ్గిన ఆత్మహత్యలు

స్టాక్‌హోమ్: ఇటీవల స్వీడన్లో ఆత్మహత్యల సంఖ్య తగ్గింది. ముఖ్యంగా పురుషుల్లో ఆ సంఖ్య తగ్గినట్లు గుర్తించారు. ఈ అంశంపై స్టడీ చేసిన పరిశోధకులు ఓ విషయాన్ని తేల్చారు. పురుషుల్లో కామశక్తిని ఉత్తేజం చేసే వయాగ్రా ఔషధం వల్ల ఆ మార్పును గమనించినట్లు గుర్తించారు. వయాగ్రా ఔషధాన్ని తక్కువ ధరకే విక్రయించడం వల్ల స్థానికులు ఆ మందును విరివిగా వాడారని, దాని వల్ల ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనల నుంచి స్వీడన్లు బయటపడినట్లు ఓ సర్వే ద్వారా తేలింది.
మానసిక ఒత్తిడిలో ఉన్నవాళ్లకు శృంగార ఆసక్తి తక్కువగా ఉంటుంది. డిప్రెషన్ వల్ల సెక్స్‌పై ఇంట్రెస్టు పోతుంది. ఒకవేళ ఇదే రివర్స్ అయితే ఎలా ఉంటుందన్న దానిపై స్టడీ జరిగింది. మానసిక ఆరోగ్యం బాగుండాలంటే.. నిరంతరం సెక్సు కూడా కీలకమే. శారీరక వాంఛలు ఎప్పటికప్పుడు తీర్చుకుంటేనే మానసిక వత్తిళ్లు పోతాయి. అయితే స్వీడన్లో డిప్రెషన్ కేసులను అధ్యయనం చేసిన పరిశోధకులు ఓ కొత్త విషయాన్ని ప్రతిపాదించారు.
స్వీడన్లో వయగ్రా ట్యాబ్లెట్‌ను సిల్డినాఫిల్ జనరిక్ పేరుతో అమ్ముతారు. 12 మాత్రల ఆ స్ట్రిప్ ఒకప్పుడు 180 డాలర్లు ఉండేది. కానీ ఇప్పుడు ఆ స్ట్రిప్‌ను కేవలం 45 డాలర్లకే అమ్ముతున్నారు. అంటే వయాగ్రా ఔషధ ధర 75 శాతం పడిపోయింది. తాజా సర్వే ప్రకారం.. సిల్డినాఫిల్ ట్యాబ్లెట్లను వాడే స్వీడన్ల సంఖ్య ఎక్కువ. 2007 నుంచి 2012 మధ్య కాలంలో సగటున ప్రతి ఏడాది 62 వేల మంది ఆ మాత్రలను వాడేవారు. ఇక 2014 నుంచి 2017 వరకు ఆ ఔషధాన్ని వాడుతున్న వారి సంఖ్య లక్ష దాటింది. రాల్ఫ్ కాటలానో దీనిపై స్టడీ చేశారు.
నిజానికి స్వీడన్లో 50 నుంచి 59 ఏళ్ల మధ్య వయసున్న వారు ఎక్కువగా సూసైడ్ చేసుకుంటుంటారు. అంగస్తంభన చికిత్సలో భాగంగా ఆ ఏజ్ గ్రూపు వారికి ఈ ట్యాబ్లెట్లను సూచిస్తుంటారు. ఇక ఆ దేశంలో సూసైడ్ మరణాల లెక్కల్ని పరిశీలిస్తే, ఆ ఏజ్ గ్రూప్ వారే ఎక్కువగా ఉన్నట్లు అంచనాకు వచ్చారు. ఈ రెండు అంశాల ఆధారంగా 50 నుంచి 59 ఏళ్ల మధ్య వయసున్న మగవారిలో సూసైడ్ రేటును గమనించారు. సిల్డినాఫిల్ ధర తగ్గిన తర్వాత.. ఆ ఏజ్ గ్రూపులో ఆత్మహత్య చేసుకుంటున్న వారి సంఖ్య నెలకు సగటును 65 కేసులు తగ్గినట్లు సర్వేలో గుర్తించారు.
పరిశోధకుల ప్రకారం శృంగార జీవితం ఆరోగ్యకరంగా ఉంటే, దాని వల్ల డిప్రెషన్ కేసులు తగ్గుతాయని అంచనాకు వచ్చారు. హెల్తీ సెక్స్ లైఫ్ వల్ల సంతోషకరంగా జీవించవచ్చు అన్న అభిప్రాయాల్ని వ్యక్తం చేశారు. జీవితంపై సంతృప్తి కూడా కలుగుతుందన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

