చాకెట్లు, షాంపూలు సహా 300 వస్తువుల దిగుమతిపై శ్రీలంక నిషేధం!
Sri Lanka | పొరుగు దేశంలో శ్రీలంక విదేశీ మారకద్రవ్యం కొరత కారణంగా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. సంక్షోభాన్ని అధిగమించేందుకు ప్రయత్నాలను చేస్తున్నది. ఇందులో భాగంగా శ్రీలంక ప్రభుత్వం చాక్లెట్లు, పెర్ఫ్యూమ్స్, షాంపూలు తదితర 300 వస్తువుల దిగుమతిని నిషేధించింది. స్వాతంత్య్రం సాధించిన అనంతరం తొలిసారిగా ఈ ద్వీప దేశం సంక్షోభంలో చిక్కుకున్నది. అధ్వాన్న స్థితికి చేరిన ఫారెక్స్ నిల్వల కారణంగా నిత్యావసర వస్తువులకు కొరత ఏర్పడగా.. ఈ ఏడాది ప్రారంభం నుంచి జనం భారీ నిరసన ప్రదర్శనలకు దిగారు.
చివరకు గొటబయ రాజపక్స ప్రభుత్వం సైతం దిగిపోయాల్సిన పరిస్థితి ఎదురైన విషయం తెలిసిందే. శ్రీలంక ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన ప్రత్యేక నోటిఫికేషన్లో చాక్లెట్లు, పెర్ఫ్యూమ్స్, మేకప్, షాంపూలతో అనేక రకాల ఉత్పత్తులు సహా మొత్తం 300 వస్తువుల దిగుమతిపై నిషేధం విధించినట్లు పేర్కొంది. ఆదేశాలు తక్షణం అమలులోకి వస్తాయంటూ పేర్కొంది. ప్రస్తుతం శ్రీలంక అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) బెయిల్ అవుట్ ప్యాకేజీ కోసం ఎదురు చూస్తున్నది. ఇప్పటికే లంక అధికారులు ఐఎంఎఫ్‌తో చర్చలు జరుపుతున్నారు. ఈ ఏడాది చివరి నాటికి ఐఎంఎఫ్ ప్యాకేజీ అందుబాటులోకి వస్తుందని శ్రీలంక సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ నందలాల్ వీరసింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kaaka | చిరంజీవి ‘కాకా’ రిలీజ్‌పై క్లారిటీ.. సంక్రాంతి బరిలో మెగాస్టార్, జనవరి 13న మెగా పొంగల్!
Chiranjeevi | మెగాస్టార్‌గా ఎదగడానికి కారణం అదే.. బీర్ తాగమని ఫ్రెండ్స్ ఒత్తిడి చేసినా నో చెప్పా: చిరంజీవి
Khammam Road Accident | గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఆగివున్న లారీని ఢీకొన్న ప్రైవేటు బస్సు.. 10 మంది ప్రయాణికులకు గాయాలు
Varanasi | వారణాసి రిలీజ్‌పై మళ్లీ సస్పెన్స్.. రాజమౌళి ఒక్క మాటతో ఫ్యాన్స్‌లో కొత్త టెన్షన్!
Naveen Polishetty | నవీన్ పొలిశెట్టిపై అభిమానుల అసహనం.. ఇంతకాలం సైలెన్స్ వెనుక కారణమేంటి?
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

