South Korea | ఎట్టకేలకు.. దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యేల్ అరెస్ట్
అభిశంసనకు గురైన దక్షిణ కొరియా (South Korea) అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌ను (Yoon Suk Yeol) పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. తీవ్ర ప్రతిగఘటనల అనంతరం యోల్‌ను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు ప్రకటించారు. దీంతో దక్షిణ కొరియా చరిత్రలో అరెస్టయిన తొలి అధ్యక్షుడిగా యోల్ నిలిచారు.
సియోల్: అభిశంసనకు గురైన దక్షిణ కొరియా (South Korea) అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌ను (Yoon Suk Yeol) పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. తీవ్ర ప్రతిగఘటనల అనంతరం యోల్‌ను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు ప్రకటించారు. దీంతో దక్షిణ కొరియా చరిత్రలో అరెస్టయిన తొలి అధ్యక్షుడిగా యోల్ నిలిచారు. అంతకుముందు బుధవారం తెల్లవారుజామున సియోల్‌లోని అధ్యక్ష భవనం వద్ద నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. యోల్‌ను అరెస్టు చేసేందుకు 3 వేల మందికిపైగా పోలీసులతో యాంటీ కరెప్షన్ ఇన్వెస్టిగేటర్లు ఆయన అధికార నివాసానికి చేరుకున్నారు. అయితే వారిని అధికార పార్టీకి చెందిన నాయకులు, యోల్ మద్దతుదారులు, వ్యక్తిగత సిబ్బంది, సైన్యం పోలీసులతోపాటు విచారణ అధికారులను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.

అయితే తీవ్ర ప్రతిఘటనల నడుమ అధ్యక్ష భవనంలోకి ప్రవేశించిన అధికారులు యోల్‌ను అరెస్టు చేశారు. ఓ ఎరుపు రంగు బస్సులో ఆయనను అక్కడి నుంచి తరలించారు. ఆయన్ని ఎక్కడి తీసుకెళ్లారనే విషయాన్ని అధికారులు వెల్లడించలేదు. అయితే యోల్‌ను గవాచియాన్‌లోని కరప్షన్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (CIO) కార్యాలయానికి తరలించే అవకాశం ఉన్నది. అక్కడ మార్షల్ లా విధింపు కేసులో విచారణ జరుపనున్నారు. అరెస్టు వారెంట్ నేపథ్యంలో 48 గంటలపాటు ఆయన్ని అదుపులో ఉంచుకునే అధికారం సీఐవోకు ఉంటుంది.
డిసెంబర్ 3న దేశంలో ఎమర్జెన్సీ మార్షల్ లా విధించిన విషయం తెలిసిందే. దీంతో ఆయనపై నేషనల్ అసెంబ్లీ 204-85 ఓట్లతో అభిశంసన తీర్మానాన్ని ఆమోదించింది. మార్షల్ లాను ప్రకటించిన కేసులో విచారణకు సహకరించకపోవడంతో ఆయనపై అరెస్టు వారెంటు జారీ అయింది. ఈ నేపథ్యంలో ఆయనను అరెస్టు చేసేందుకు అధికారులు ఈ నెల 3 విఫల యత్నం చేశారు. తెల్లవారుజామునే అధ్యక్ష భవనానికి చేరుకున్న అధికారులను సైన్యంతోపాటు ఆయన వ్యక్తిగత సిబ్బంది అడ్డుకున్నారు. సుమారు ఆరు గంటల పాటు.. అధ్యక్షుడి భద్రతా సిబ్బందితో పోలీసులు వాగ్వాదానికి దిగారు. చివరకు అరెస్టును వాయిదా వేసుకున్న పోలీసులు వెనక్కి మళ్లారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Laxma Reddy | రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
Assam Girl | అసోం యువతి మృతి కేసులో ట్విస్ట్.. రైల్వే ట్రాక్ పక్కనే మరో డెడ్‌బాడీ..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

