Yoon Suk Yeol: దక్షిణకొరియా దేశాధ్యక్షుడిని పదవి నుంచి తొలగిస్తూ రాజ్యాంగ కోర్టు ఆదేశాలు
Yoon Suk Yeol: దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌ను ఆ పదవి నుంచి తొలగిస్తూ ఆ దేశ రాజ్యాంగ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. గత ఏడాది డిసెంబర్లో దేశంలో మార్షియల్ చట్టాన్ని ప్రయోగించిన నేపథ్యంలో.. అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌కు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఆయన అభిశంసనకు గురయ్యారు. ఆ తర్వాత జైలుపాలై రిలీజయ్యారు.
సియోల్: అభిశంసనకు గురైన దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్(Yoon Suk Yeol)ను తొలగిస్తూ ఆ దేశ రాజ్యాంగ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. గత ఏడాది డిసెంబర్లో దేశంలో మార్షియల్ చట్టాన్ని ప్రయోగించిన నేపథ్యంలో.. అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌కు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఆయనపై పార్లమెంట్లో అభిశంసన జరిగింది. అయితే అభిశంసనలో ఓడిన ప్రెసిడెంట్ యూన్‌ను ఆఫీసు నుంచి తప్పిస్తూ ఇవాళ రాజ్యాంగ కోర్టు ఆదేశాలు ఇచ్చింది.
మరో 60 రోజుల్లో దేశాధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. రాజ్యాంగ కోర్టు తాత్కాలిక చీఫ్ మూన్ యుంగ్ బే ఇచ్చిన ఆదేశాలను జాతీయ టీవీల్లో ప్రసారం చేశారు. దీంతో ప్రజలు సంబరాల్లో తేలారు. యూన్‌పై అభిశంసనను 8 మంది సభ్యులున్న రాజ్యాంగ కోర్టు బెంచ్ సమర్థించింది. మాజీ దేశాధ్యక్షుడు యూన్ సుక్ యోల్ రాజ్యాంగాన్ని ఉల్లంఘించి మార్షియల్ చట్టాన్ని విధించినట్లు మూన్ తెలిపారు.
అభిశంసనకు గురైన దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ ను జైల్లో వేశారు. ఆ తర్వాత ఆయన గత నెలలో జైలు నుంచి విడుదలయ్యారు. దేశ రాజధాని సియోల్‌లోని న్యాయస్థానం ఆయన అరెస్టును రద్దు చేసిన నేపథ్యంలో యూన్‌కు నిర్బంధం నుంచి విముక్తి లభించింది. గత డిసెంబరులో స్వల్పకాలం పాటు సైనిక పాలన విధిస్తూ యూన్ వెలువరించిన ఆదేశాలు దక్షిణ కొరియాలో పెను సంక్షోభాన్ని సృష్టించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

