అమెరికా విమానంలో పాము.. షాకైన ప్రయాణికులు
snake in plane:విమానంలో పాము కనిపించడంతో.. దాంట్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఆందోళనకు గురైయ్యారు. ఈ ఘటన అమెరికాలోని నివార్క్ లిబర్టీ అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్‌లో జరిగింది. ఫ్లోరిడాలోని టంపా సిటీ నుంచి న్యూజెర్సీకి వచ్చిన విమానంలో ఓ పాము ప్రయాణికులకు టెన్షన్‌కు గురిచేసింది. నివార్క్ విమానాశ్రయంలో ల్యాం
న్యూజెర్సీ: విమానంలో పాము కనిపించడంతో.. దాంట్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఆందోళనకు గురైయ్యారు. ఈ ఘటన అమెరికాలోని నివార్క్ లిబర్టీ అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్‌లో జరిగింది. ఫ్లోరిడాలోని టంపా సిటీ నుంచి న్యూజెర్సీకి వచ్చిన విమానంలో ఓ పాము ప్రయాణికులను టెన్షన్‌కు గురిచేసింది. నివార్క్ విమానాశ్రయంలో ల్యాండ్ అయిన సమయంలో బిజినెస్ క్లాస్‌లో ఆ పాము కనిపించింది. అప్పుడు దాంట్లో ఉన్న ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు.
యునైటెడ్ ఫ్లయిట్ 2038 విమానంలో ఆ సర్పం దర్శనమిచ్చింది. అయితే విమానాశ్రయంలో ఉండే వైల్డ్‌లైఫ్ ఆపరేషన్స్ సిబ్బంది ఆ పామును పట్టుకున్నది. దాన్ని గార్టర్ స్నేక్‌గా గుర్తించారు. ఆ పామును సమీప అడవుల్లో వదిలేశారు. పాము వల్ల ఎవరికీ గాయం కాలేదని, విమాన ఆపరేషన్స్‌కు కూడా ఎటువంటి సమస్య రాలేదని నివార్క్ విమానాశ్రయం ఓ ప్రకటనలో తెలిపింది.
విమానం ల్యాండ్ అయిన తర్వాత ట్యాక్సింగ్ చేస్తున్నప్పుడు బిజినెస్ క్లాస్‌లో కూర్చున్న ప్రయాణికులు ఆ పామును గుర్తించారు. టెన్షన్‌కు గురైన ప్యాసింజెర్లు కాళ్లను పైకిఎత్తి సీట్లపైకి వెళ్లిపోయారు. విమాన సిబ్బంది వైల్డ్‌లైఫ్ ఆపరేషన్స్‌కు సమాచారం ఇచ్చారు. పామును పట్టుకున్న తర్వాతే ప్రయాణికుల విమానం నుంచి దిగారు. ఆ తర్వాత లగేజీలను కూడా దించారు.
గార్టర్ పాములు ఫ్లోరిడాలో చాలా ఎక్కువగా కనిపిస్తుంటాయి. అవి విషసర్పాలు కావు. సుమారు 18 నుంచి 26 ఇంచు పొడుగు ఉంటాయి. న్యూజెర్సీలోనూ ఇలాంటి సర్పాలు అధికంగా ఉంటాయని తెలుస్తోంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

