Condoms for youth: ఫ్రాన్స్‌లో యువతకు ఫ్రీగా కండోమ్‌లు.. ఎందుకో తెలుసా..?
Condoms for youth | ఫ్రాన్స్ ప్రభుత్వం తమ దేశంలోని యువతరం కోసం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ దేశంలోని 18 నుంచి 25 ఏండ్ల లోపు యువతకు ఉచితంగా
పారిస్: ఫ్రాన్స్ ప్రభుత్వం తమ దేశంలోని యువతరం కోసం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ దేశంలోని 18 నుంచి 25 ఏండ్ల లోపు యువతకు ఉచితంగా కండోమ్‌లు అందించనున్నట్టు ప్రకటించింది. వచ్చే ఏడాది ప్రారంభం నుంచి అంటే 2023 జనవరి నుంచే ఫ్రాన్స్ యువతకు ఉచిత కండోమ్‌లు అందుబాటులోకి రానున్నాయి.
దేశంలోని అన్ని ఫార్మసీల ద్వారా యువత ఉచిత కండోమ్‌లను తీసుకోవచ్చని ఫ్రాన్స్ సర్కారు వెల్లడించింది. ఈ మేరకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ స్వయంగా ప్రకటన చేశారు. అయితే, ఫ్రాన్స్ తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆ దేశం ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందని ఇతర దేశాల్లో చర్చ జరుగుతున్నది.
ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ చేసిన ప్రకటన ప్రకారం.. ఆ దేశంలో అవాంఛిత గర్భధారణలు పెరిగిపోయాయి. అదేవిధంగా ఫ్రాన్స్‌లో జనాభా నియంత్రణ కూడా గాడి తప్పింది. వీటికి తోడు లైంగికపరమైన సాంక్రమిక వ్యాధులు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ సమస్యలన్నింటికి శాశ్వత పరిష్కారం కోసం ఫ్రాన్స్ ప్రభుత్వం ఆలోచన చేసింది. ఆ ఆలోచనల ఫలితంగానే దేశంలో యువతకు ఉచితంగా కండోమ్‌లను అందించాలనే నిర్ణయానికి వచ్చింది.
ఫ్రాన్స్ అధికారిక లెక్కల ప్రకారం 2020, 2021 సంవత్సరాల్లో లైంగికపరమైన సాంక్రమిక వ్యాధుల బారినపడిన వారి సంఖ్య 30 శాతం పెరిగింది. ఈ వ్యాధుల నివారణతోపాటు జనాభా నియంత్రణలో కూడా తన ప్రభుత్వ నిర్ణయం ఒక చిన్న విప్లవంలా పనిచేస్తుందని ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ వ్యాఖ్యానించారు.
ఫ్రాన్స్ ప్రభుత్వం గతంలో కూడా ఇలాంటి పథకాలను తీసుకొచ్చింది. ఫ్రాన్స్ పౌరులు కండోమ్స్ కొనుగోలు చేస్తే వాటికయ్యే ఖర్చును ప్రభుత్వమే తిరిగి చెల్లించే విధంగా 2018లో ఒక పథకాన్ని తీసుకొచ్చింది. అదేవిధంగా ఈ ఏడాది ప్రారంభంలో 26 ఏండ్లలోపు మహిళలకు ఉచితంగా గర్భనిరోధక మాత్రలను అందజేసే పథకాన్ని తీసుకొచ్చింది. అదేవిధంగా 26 ఏండ్లలోపు మహిళలకు ఫ్రాన్స్‌లో ఉచితంగా లైంగిక వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అబార్షన్లు కూడా ఉచితంగా చేస్తున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

