లండన్: డ్రైవర్ అవసరం లేని కార్ల తరహాలోనే త్వరలో సెల్ఫ్ ఫ్లైయింగ్ విమానాలు వచ్చే అవకాశం ఉంది. విమాన తయారీ సంస్థలు ఈ ఆటోమేటిక్ విమానాల తయారీపై దృష్టి సారించాయి. ఇవి వాటికవే టేకాఫ్, ల్యాండింగ్ అవడంతో పాటు అత్యవసర స్థితి ఏర్పడితే అదుపు చేసేలా అభివృద్ధి చేసేందుకు ఈ సంస్థలు కసరత్తు చేస్తున్నాయి. ఆటోమేటెడ్ ల్యాండింగ్ టెక్నాలజీతో ఎయిర్ బస్ తయారుచేసిన డ్రాగన్‌ఫ్లై విమానాన్ని త్వరలోనే పరీక్షించనున్నారు. జ్వింగ్ అనే సంస్థ కూడా సెల్ఫ్ డ్రైవింగ్ కార్గో విమానాన్ని తయారుచేస్తున్నది. అయితే, ఈ విమానాలు ప్రమాదకరమని పైలట్లు హెచ్చరిస్తున్నారు. విమానాల్లో అత్యవసర పరిస్థితులు తలెత్తితే అదుపు చేయడానికి కచ్చితంగా ఇద్దరు పైలట్లు ఉండాలంటున్నారు.