India – Canada | వీసా సేవల పునరుద్ధరణ సానుకూల సంకేతం.. భారత్ నిర్ణయాన్ని స్వాగతించిన కెనడా
India - Canada | కెనడా (Canada) లో నిలిపివేసిన వీసా సేవలను పునరుద్ధరించాలన్న భారత్ (Indias visa services move) నిర్ణయాన్ని కెనడా స్వాగతించింది. రెండు దేశాల మధ్య నెలకొన్న ఆందోళనకర పరిస్థితుల్లో ఈ నిర్ణయం సానుకూల సంకేతమని అభిప్రాయపడింది.
India – Canada | కెనడా (Canada) లో నిలిపివేసిన వీసా సేవలను పునరుద్ధరించాలన్న భారత్ (Indias visa services move) నిర్ణయాన్ని కెనడా స్వాగతించింది. రెండు దేశాల మధ్య నెలకొన్న ఆందోళనకర పరిస్థితుల్లో ఈ నిర్ణయం సానుకూల సంకేతమని అభిప్రాయపడింది. ఖలిస్థాన్ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత్ ప్రమేయం ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ట్రూడో ఆరోపణలతో రెండు దేశాల మధ్య దౌత్యసంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కెనడాలో వీసాల జారీ ప్రక్రియను నిలిపివేస్తూ భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే, వీసా సేవలను కొన్నింటిని తిరిగి పునరుద్ధరిస్తున్నట్లు భారత్ బుధవారం ప్రకటించింది.
కెనడా ప్రభుత్వం ఇటీవల చేసిన ఏర్పాట్లు, భద్రతా చర్యలపై సమీక్షించిన అనంతరం ఇంచుమించు నెల రోజుల తర్వాత ఈ నెల 26 నుంచి ఎంట్రీ వీసా, బిజినెస్ వీసా, మెడికల్ వీసా, కాన్ఫరెన్స్ వీసా సర్వీసులను పునరుద్ధరిస్తున్నట్టు ఒట్టావాలోని భారత హై కమిషన్ కార్యాలయ ప్రతినిధి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.
ఈ మేరకు భారత్ నిర్ణయంపై కెనడా ఇమ్మిగ్రేషన్ మినిస్టర్ మార్క్ మిల్లర్ (Immigration minister Marc Miller) తాజాగా స్పందిస్తూ.. రెండు దేశాల మధ్య నెలకొన్న ఆందోళనకర పరిస్థితుల్లో భారత్ తీసుకున్న ఈ నిర్ణయం సానుకూల సంకేతమని అన్నారు. భారత్‌తో దౌత్యపరమైన పరిస్థితులు చాలా మందిని భయాందోళనకు గురిచేశాయన్నారు. ఇలాంటి పరిస్థితులు నెలకొన్న సమయంలో సస్పెన్షన్ అనేది మొదటి నిర్ణయం కాకూడదని అభిప్రాయం వ్యక్తం చేశారు.
Also Read..
Czech Influencer | హెలికాఫ్టర్ నుంచి డాలర్ల వర్షం.. ఏరుకోవడానికి ఎగబడ్డ జనం.. వీడియో
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bengaluru Techie’s Kidnap | టెక్కీ కిడ్నాప్ కేసులో 11 మంది అరెస్ట్.. అతడు అత్యాచారానికి పాల్పడినట్లు కిడ్నాపర్ మహిళ ఫిర్యాదు
Tirumala | తిరుమలలో నీటి ఎద్దడి రాకుండా పటిష్ట చర్యలు.. 150 రోజులకు సరిపడా నీటి నిల్వలు : టీటీడీ
Water Tanker | హైదరాబాద్ రోడ్లపై.. వాటర్ ట్యాంకర్లో నుంచి వృధాగా పోతున్న నీళ్లు.. వీడియో
Case Register | రైస్‌మిల్‌లో రూ.13.77 కోట్ల సీఎంఆర్ ధాన్యం మాయం.. మిల్లు భాగస్వాములపై కేసు నమోదు
Premayanam | ఓటీటీలో అదరగొడుతున్న ‘ప్రేమాయణం’ వెబ్ సిరీస్.. ఆకట్టుకుంటున్న బ్యూటిఫుల్ లవ్‌స్టోరీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

