వ్యాక్సినేషన్లో మరో మైలురాయి దాటిన ఆస్ట్రేలియా..

మెల్బోర్న్: ఆస్ట్రేలియా వ్యాక్సినేషన్ ప్రక్రియలో కొత్త మైలురాయిని అందుకున్నది. 16 ఏళ్లు దాటిన వారిలో 80 శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తి అయినట్లు ఆ దేశ ప్రధాని స్కాట్ మారిసన్ తెలిపారు. అద్భుతమైన మైలురాయిని అందుకున్నామని, ప్రపంచంలో కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న దేశాల్లో ఆస్ట్రేలియా ఓ కొత్త రికార్డును నెలకొల్పనున్నట్లు ఆయన చెప్పారు. ఫేస్బుక్లో వీడియో పోస్టు చేసిన మారిసన్.. అయిదుగురిలో నలుగురికి వ్యాక్సిన్ ఇచ్చామని, ఇది ఆస్ట్రేలియా జాతీయ రికార్డు అన్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతోంది. అయితే వ్యాక్సిన్ తీసుకోని వారికి ఇంకా ఆంక్షలు విధిస్తున్నారు. తప్పనిసరి వ్యాక్సిన్ నిబంధనకు వ్యతిరేకంగా సుమారు మూడు వేల మంది మెల్బోర్న్లో ధర్నా చేశారు. న్యూ సౌత్ వేల్స్ రాష్ట్రంలో అర్హులైన 90 శాతం మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. రాజధాని క్యాన్బెరాలో వ్యాక్సినేషన్ 95 శాతం జరిగింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
“కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో” అనే నినాదంతో రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి కేసీఆర్ పువ్వాడ అజయ్ కుమార్
Actor Abbas | రీఎంట్రీకి సిద్ధమైన ‘ప్రేమదేశం’ హీరో.. విజయ్ దేవరకొండ సినిమాలో అబ్బాస్ పవర్ఫుల్ రోల్!
Diabetes | డయాబెటిస్ చికిత్సలో చిగురిస్తున్న ఆశలు.. నూతన తరహా ఔషధాలను ప్రయోగిస్తున్న నిపుణులు..
PM Modi | డ్రగ్ అడిక్షన్ యువతకు పెను సవాల్.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ..!
Nabha Natesh | గ్లామర్ డోస్ పెంచేసిన నభా నటేష్.. పొట్టి గౌనులో ఇస్మార్ట్ బ్యూటీ అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

