మాస్కో: ఉక్రెయిన్‌పై యుద్ధానికి వెళ్లిన రష్యాపై యురోపియన్ దేశాలు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. రష్యా విమానాలను కూడా యురోప్ దేశాలు తమ గగనతలంలోకి అనుమతి ఇవ్వడం లేదు. అయితే ఇటీవల స్పెయిన్, గ్రీస్ దేశాలు రష్యా దౌత్యవేత్తలను వెలివేసింది. ఇక వాళ్లను తీసుకువచ్చేందుకు రష్యా విమానం ఒకటి స్పెయిన్, గ్రీస్ దేశాలకు వెళ్లింది. ఆ రెండు దేశాలు ఒకసారి షరతుపై రష్యా విమానం ఎంట్రీకి అవకాశం ఇచ్చారు. దీంతో ఆ రెండు దేశాల్లో ఉన్న రాయబారుల్ని తీసుకువచ్చేందుకు రష్యా ఓ విమానాన్ని పంపంది. కానీ ఆ విమానం రెగ్యులర్ రూట్లో కాకుండా భిన్న రూట్లో వెళ్లింది. అయితే ఆ విమానం సుమారు 15 వేల కిలోమీటర్లు ప్రయాణించినట్లు ఫ్లయిట్ రేడార్24 వెబ్సైట్ ద్వారా తెలుస్తోంది. మాస్కో నుంచి తొలుత మాడ్రిడ్‌కు ఆ విమానం సముద్రం మార్గం ద్వారా వెళ్లింది. ఆ తర్వాత మాడ్రిడ్ నుంచి ఏథెన్స్ కు ఆఫ్రికా రూట్లో వెళ్లింది. ఆ తర్వాత ఏథెన్స్ నుంచి మాస్కోకు టర్కీ మీదుగా చేరుకున్నది. దీంతో ఆ విమాన దూరం రెండింతలైంది.
Plane sent from Moscow to collect expelled Russian diplomats from Spain, then Greece, was forced to make 15K detour because of EU flight ban—almost as long as world's longest flight between Singapore and New York, according to @flightradar24. https://t.co/lsQrF124pH pic.twitter.com/4gyN1Ihkrr
— Lucian Kim (@Lucian_Kim) April 19, 2022