రష్యా పెట్రోలింగ్ బోట్లను పేల్చేసిన ఉక్రెయిన్.. వీడియో
కీవ్: నల్లసముద్రంలోని స్నేక్ ఐలాండ్ వద్ద పెట్రోలింగ్ నిర్వహిస్తున్న రెండు రష్యా బోట్లను ఉక్రెయిన్ పేల్చివేసింది. దానికి సంబంధించిన వీడియోను కూడా రిలీజ్ చేశారు. ఇవాళ ఉదయం స్నేక్ ఐలాండ్ వద్ద రెండు రప్తార్ బోట్లను ధ్వంసం చేసినట్లు ఉక్రెయిన్ రక్షణ శాఖ తెలిపింది. బోట్ల పేల్చివేతకు సంబంధించిన బ్లాక్ అండ్ వైట్ ఫూటేజ్‌ను రిలీజ్ చేశారు. మిలిటరీ బోటులో భారీగా పేలుడు సంభవించిన దృశ్యాలు దాంట్లో ఉన్నాయి. టర్కీకి చెందిన బైరక్తార్ డ్రోన్లతో ఆ దాడి జరిగిందని, ఆ డ్రోన్లు పనిచేస్తున్నట్లు ఉక్రెయిన్ సైనిక దళాల కమాండర్ ఇన్ చీఫ్ వలేరి జలుజిని తెలిపారు. రప్తార్ పెట్రోలింగ్ బోట్లలో ముగ్గురు సిబ్బంది ఉంటారు. మరో 20 మందిని అవి తీసుకువెళ్లగలవు. వాటిల్లో సాధారణంగా మెషిన్ గన్స్ ఉంటాయి. ల్యాండింగ్ ఆపరేషన్స్ కోసం వీటిని ఎక్కువగా వాడుతుంటారు. స్నేక్ ఐలాండ్ వద్ద ఉక్రెయిన్ దళాలు రష్యాను తీవ్రంగా ప్రతిఘటించాయి. ఇటీవల అక్కడ కొందరు ఉక్రెయిన్ సైనికులు సరెండర్ అయ్యేందుకు నిరాకరించారు. ఈ మధ్యనే నల్లసముద్రంలో పార్కింగ్ చేసిన మాస్క్వా యుద్ధ నౌకను కూడా పేల్చినట్లు ఉక్రెయిన్ వెల్లడించిన విషయం తెలిసిందే.
💬Головнокомандувач ЗС України генерал Валерій Залужний:
Сьогодні на світанку біля острова Зміїний було знищено два російські катери типу Раптор.
Працює #Байрактар.
Разом до Перемоги!🇺🇦 pic.twitter.com/3wxlwjDtdx— Defense of Ukraine (@DefenceU) May 2, 2022
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

