American drones | సిరియాలో అమెరికా డ్రోన్లను వెంటాడిన రష్యా జెట్ విమానాలు
సిరియాలో రష్యా జెట్ విమానాలు (Russian aircraft) మరోసారి అమెరికన్ డ్రోన్లను (American drones) వెంబడించాయి. డ్రోన్లకు సమీపంగా వెళ్లడంతోపాటు వాటి పనితీరును దెబ్బతీసేలా చేశాయి. ఈ మేరకు అమెరికా వాయుసేన ప్రకటించింది
వాషింగ్టన్: సిరియాలో రష్యా జెట్ విమానాలు (Russian aircraft) మరోసారి అమెరికన్ డ్రోన్లను (American drones) వెంబడించాయి. డ్రోన్లకు సమీపంగా వెళ్లడంతోపాటు వాటి పనితీరును దెబ్బతీసేలా చేశాయి. ఈ మేరకు అమెరికా వాయుసేన ప్రకటించింది. గురువారం ఉదయం 9.30 (స్థానిక కాలమానం ప్రకారం) సిరియాలో (Syria) ఇస్లామిక్ స్టేట్ గ్రూప్‌నకు (Islamic State jihadist group) సంబంధించి రహస్య ఆపరేషన్ చేస్తున్న తమ మూడు డ్రోన్లను రష్యాకు (Russia) చెందిన ఫైటర్ జెట్ విమానాలు వెంబడించాయని ఎయిర్‌ఫోర్స్ లెఫ్టినెంట్ జనరల్ అలెక్సస్ గ్రెన్కెవిచ్ (Alexus Grynkewich) చెప్పారు.
రష్యా విమానం ప్రమాదకరంగా ఓ డ్రోన్‌కు సమీపం నుంచి వెళ్లడంతోపాటు పారాచుట్లలో మంటలు రాజేసి ఎంక్యూ-9 (MQ-9) రీపర్ల పనితీరు సామర్థ్యాన్ని దెబ్బతీసేలా చేసిందని వెల్లడించారు. రష్యా సేనలు ఇలా చేయడం గత 24 గంటల్లో ఇది రెండోసారని పేర్కొన్నారు.
ఈ ఏడాది మార్చి 15న నల్లసముంద్రంలో అమెరికా నిఘా డ్రోన్‌ను రష్యా ఫైటర్ జెట్ ఢీకొట్టిన విషయం తెలిసిందే. ప్రొపెల్లర్ ధ్వంసం కావడంతో డ్రోన్‌ను అంతర్జాతీయ జలాల్లో అమెరికా కూల్చివేసింది. అంతకుముందు డ్రోన్‌పై ఫైటర్ జెట్లు ఇంధనాన్ని కుమ్మరించాయని యూఎస్ వాయుసేన తెలిపింది. ఇది ముమ్మాటికి అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేనని స్పష్టం చేసింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ENE Repeat | ‘ఈఎన్ఈ రిపీట్’ అందరూ కలిసి ఎంజాయ్ చేసేలా ఉంటుంది.. ట్రైలర్ లాంచ్‌లో తరుణ్ భాస్కర్!
Pocket Rockets | నిహారిక కొణిదెల ‘పాకెట్ రాకెట్స్’ టీజర్ విడుదల.. డిసెంబర్ 11న థియేటర్లలో సందడి!
Air Pollution | నగరాల్లో తీవ్రమవుతున్న వాయు కాలుష్యం.. జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న నిపుణులు..
ఎంజీయూ హాస్టల్స్ డైరెక్టర్‌గా డా.జి లక్ష్మీప్రభ నియామకం
‘గొర్రెల కాపరులకు పింఛన్లు ఇవ్వాలి’
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

