రష్యా యుద్ధ నౌక మాస్క్వా ధ్వంసం..
కీవ్: రష్యా యుద్ధ నౌక.. మిస్సైల్ క్రూయిజర్ మాస్క్వా తీవ్ర స్థాయిలో ధ్వంసమైంది. నల్ల సముద్రంలో ఉన్న రష్యా నౌకా దళానికి చెందిన యుద్ధ నౌక మాస్క్వాపై భారీ పేలుడు జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఆ క్రూయిజ్ నౌకను తామే నెప్ట్యూన్ మిస్సైల్స్‌తో పేల్చినట్లు ఉక్రెయిన్ చెబుతోంది. ఆ యుద్ధ నౌకలో సుమారు 510 మంది సిబ్బంది ఉన్నారని, వారిని రష్యా రక్షించలేకపోయినట్లు ఉక్రెయిన్ తెలిపింది. బ్లాక్ సీలోని స్నేక్ ఐలాండ్ వద్ద ఉన్న మాస్క్వా క్రూయిజ్ నౌకపై దాడి జరిగినట్లు ఉక్రెయిన్ వెల్లడించింది. కానీ ఆ నౌకలో పేలుడు జరిగినట్లు రష్యా చెబుతోంది. దానిలో ఉన్న సిబ్బంది ఆ యుద్ధనౌకను వదిలి వెళ్లినట్లు రష్యా అంగీకరించింది.
మాస్క్వా మిస్సైల్ క్రూయిజర్‌ను 1980 దశకంలో నిర్మించారు. ఉక్రెయిన్‌లోని మైకోలేవ్ నగరంలో ఆ నౌకను తయారు చేశారు. సోవియేట్ నౌకాదళంలో ఈ నౌక కీలక పాత్ర పోషించింది. ఇది సుమారు 186 మీటర్ల పొడుగు ఉంటుంది. దీన్ని మొదట్లో స్లావా అని పిలిచేవారు. ఆ తర్వాత మాస్క్వా అని పిలుస్తున్నారు. మాస్క్వా అంటే మాస్కో అన్న అర్థం వచ్చేలా ఈ క్రూయిజర్‌కు పేరు పెట్టారు.
ఈ నౌకలోని ప్రధాన ఆయుధం పీ-1000 వోల్కన్ యాంటీ షిప్ మిస్సైల్స్. అయితే నల్ల సముద్రంలో 2000 నుంచి రష్యాకు కీలకమైన నౌకగా సేవలు అందిస్తోంది. 2015లో సిరియాపై జరిగిన యుద్ధంలో ఈ యుద్ధ నౌక రష్యా ప్రధాన అస్త్రంగా నిలిచింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్‌లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
Akka Teaser | ‘అక్క’ టీజర్‌తో ఆసక్తి రేపుతున్న కీర్తి సురేశ్.. రాధికా ఆప్టేతో హోరాహోరీ పోరు!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

