Moscow Terror Attack | మాస్కో ఉగ్రదాడిలో ఉక్రెనియన్ల పాత్రను దాస్తున్న అమెరికా.. ఆరోపించిన రష్యా
రష్యా రాజధాని మాస్కోలో జరిగిన ఉగ్రదాడిలో (Moscow Terror Attack) ఉక్రెనియన్ల పాత్ర ఉన్నట్లు రష్యా (Russia) అనుమానం వ్యక్తంచేస్తున్నది. దాడికి సంబంధించి ముందే హెచ్చరించామని చెప్పిన అమెరికా.. అందులో ఉక్రేనియన్ల పాత్రకు సంబంధించిన విషయాన్ని దాచిపెడుతున్నదని ఆరోపించింది.
మాస్కో: రష్యా రాజధాని మాస్కోలో జరిగిన ఉగ్రదాడిలో (Moscow Terror Attack) ఉక్రెనియన్ల పాత్ర ఉన్నట్లు రష్యా (Russia) అనుమానం వ్యక్తంచేస్తున్నది. దాడికి సంబంధించి ముందే హెచ్చరించామని చెప్పిన అమెరికా.. అందులో ఉక్రేనియన్ల పాత్రకు సంబంధించిన విషయాన్ని దాచిపెడుతున్నదని ఆరోపించింది. మాస్కోలోని క్రాకస్ సిటీ కన్సర్ట్ హాల్లో చొరబడిన దుండగులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ దాడిలో 60 మందికిపైగా చనిపోగా, మరో 100 మంది గాయపడ్డారు. దాడిచేసింది తామేనని ఐసిస్ (ISIS) ప్రకటించింది.
కాగా, ఉగ్రదాడి జరిగే అకాశం ఉందని నెల రోజుల క్రితమే రష్యాను హెచ్చరించినట్లు అమెరికా ప్రకటించింది. ఇదే విషయమై జాతీయ సెక్యూరిటీ కౌన్సిల్ అధికార ప్రతినిధి జాన్ కిర్బీ మాట్లాడుతూ.. దాడికి సంబంధిచిన చిత్రాలు హృదయవిదారకంగా ఉన్నాయని చెప్పారు. ఇది తమను షాక్‌కు గురిచేసిందన్నారు. అయితే దాడిలో ఉక్రెయినియన్లు పాలుపంచుకున్నారాని మీడియా ప్రతినిథులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం దాటవేశారు. కాల్పుల్లో ఉక్రెయిన్ లేదా ఆదేశ పౌరుల పాత్ర ఉన్నట్లు ప్రస్తుతానికి తమవద్ద ఎలాంటి సమాచారం లేదన్నారు. అయితే ఈ దాడిలో ఉక్రేనియన్ల పాత్రను అమెరికా దాచిపెడుతున్నదని రష్యా ఆరోపించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘టీఎస్ యూటీఎఫ్ నల్లగొండ జిల్లా మహాసభలను విజయవంతం చేయండి’
Cop Rapes Girl | పోలీస్ సహాయం కోరిన బాలిక.. కార్యాలయంలో పోలీస్ అధికారి అత్యాచారం
Harish Rao | రేవంత్ రెడ్డి అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్..భూములను కాపాడిందే బీఆర్ఎస్ : మాజీ మంత్రి హరీష్‌రావు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
‘కార్మిక హక్కుల పరిరక్షణకు ఐక్య పోరాటాలు కొనసాగించాలి’
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

