న్యూయార్క్: మీడియా మొఘల్, 92 ఏండ్ల రూపర్ట్ మర్డాక్ ఐదోసారి పెండ్లి చేసుకోనున్నారు. ఇప్పటికే నలుగురితో విడాకులు తీసుకున్న ఆయన.. తాజాగా మరో వివాహానికి సిద్ధమయ్యారు.
మరో మీడియా సంస్థ ప్రముఖుడైన దివంగత చెస్టర్ స్మిత్ భార్య అయిన 66 ఏండ్ల లెస్లీ ఆన్‌ను వివాహం చేసుకోబోతున్నట్టు ప్రకటించిన మర్డాక్.. ఇదే తన చివరి పెండ్లి అని తెలిపారు. వీరి ఎంగేజ్మెంట్ న్యూయార్క్‌లోని సెయింట్ పాట్రిక్‌లో జరిగింది.