వాషింగ్టన్, డిసెంబర్ 2: నిద్రలేమికి, డయాబెటిస్‌కు సంబంధం ఉన్నదని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. సరిపడా నిద్ర లేకపోవడం.. డయాబెటిస్ టైప్-2కు దారితీస్తుందని యూనివర్సిటీ ఆఫ్ సౌత్ అస్ట్రేలియా పరిశోధకుల తాజా అధ్యయనం పేర్కొన్నది. నిద్ర సమస్య ఉన్న వారిలో కార్డియోమెటబాలిక్ అనారోగ్య సమస్యలు, కొలెస్ట్రాల్, శరీర బరువు వంటి టైప్-2 డయాబెటిస్‌కు దోహదం చేసే పలు అంశాలను గుర్తించారు. దాదాపు 45 ఏండ్ల వయసుండే వెయ్యి మందిపై పరిశోధకులు ఈ అధ్యయనం నిర్వహించారు. మనం ఎన్ని గంటలు నిద్ర పోతున్నాం..ఎంత ప్రశాంతంగా నిద్ర పడుతుందనే దానిపై ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నదని పరిశోధకులు లీసా మెట్రిసియాని పేర్కొన్నారు.