పుతిన్ బెదిరిస్తే భయపడం: బైడెన్
Joe Biden:రష్యాకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వార్నింగ్ ఇచ్చారు. పుతిన్ బెదిరిస్తే తామేమీ భయపడేది లేదని ఆయన అన్నారు. ఉక్రెయిన్‌లోని నాలుగు కీలక ప్రాంతాలను రష్యాలో విలీనం చేసినట్లు శుక్రవారం పుతిన్ ప్రకటన చే
న్యూయార్క్: రష్యాకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వార్నింగ్ ఇచ్చారు. పుతిన్ బెదిరిస్తే తామేమీ భయపడేది లేదని ఆయన అన్నారు. ఉక్రెయిన్‌లోని నాలుగు కీలక ప్రాంతాలను రష్యాలో విలీనం చేసినట్లు శుక్రవారం పుతిన్ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఆ ప్రాంతాలను కాపాడుకునేందుకు తాము అణ్వాయుధాలను కూడా వినియోగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు పుతిన్ వార్నింగ్ ఇచ్చారు. ఆ ప్రాంతాలు ఎప్పటికీ రష్యాలోనే ఉంటాయన్నారు. ఈ నేపథ్యంలో అమెరికా కౌంటర్ ఇచ్చింది. పుతిన్ బెదిరింపులకు భయపడేది లేదని బైడెన్ అన్నారు. పుతిన్ బాధ్యతలేకుండా మాట్లాడుతున్నారని, బెదిరిస్తున్నారని బైడెన్ తెలిపారు. అమెరికా, మిత్రదేశాలు పుతిన్ బెదిరింపులకు లొంగిపోవన్నారు. నాటో కూటమి దళాలతో కలిసి నాటో భూభాగంలో ప్రతి ఇంచును రక్షించుకునేందుకు అమెరికా సంసిద్దమైందన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

