టీకా వేయించుకోని కుమార్తె.. పబ్‌లోకి అనుమతించని ఓనర్

లండన్: కరోనా టీకా వేయించుకోని సొంత కుమార్తెను పబ్ యజమానురాలు లోనికి అనుమతించలేదు. కరోనా నిబంధనల అమలులో నిదర్శనంగా నిలిచిన ఈ పబ్ యజమానిపై ప్రశంసలు వెల్లువెత్తాయి. బ్రిటన్‌లో కరోనా నేపథ్యంలో విధించిన లాక్డౌన్ వల్ల చాలా కాలంగా పలు వ్యాపారాలు మూతపడ్డాయి. కాగా ఆంక్షల సడలింపు నేపథ్యంలో ప్రస్తుతం అన్ని తెరుచుకున్నాయి. అయితే కరోనా టీకాలు పూర్తిగా తీసుకున్న వారినే ప్రవేశానికి అనుమతిస్తామని ఓ పబ్ పేర్కొంది. ఈ నేపథ్యంలో కరోనా వ్యాక్సిన్ ఒక్క డోసు అయినా వేయించుకోని కుమార్తె పబ్ వద్దకు రాగా లోనికి ప్రవేశానికి ఆమె తల్లి, యజమానురాలైన షెల్లీ జోన్స్ నిరాకరించింది. ‘సారీ.. నిన్ను లోపలికి అనుమతించలేను’ అని ముఖంమీదే చెప్పేసింది.
తమ పబ్‌కు వయసుపైబడిన వారు కూడా వస్తుంటారని, టీకా వేయించుకోని వారి వల్ల అలాంటి వారు అనారోగ్యానికి గురి కావడం తమకు ఇష్టం లేదని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు జోన్స్ తెలిపారు. మహమ్మారి కాలంలో వృద్ధులు, రోగాల బారినపడే అవకాశమున్న కస్టమర్లను రక్షించడానికి తమ పబ్ ప్రయత్నిస్తోందని చెప్పారు. కాగా, జోన్స్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని చాలా మంది అభినందించారు. అయితే టీకా తీసుకోని తనని పబ్‌లోనికి అనుమతించకపోగా తన పట్ల దురుసుగా ప్రవర్తించారని ఒకరు ఆరోపించారు.
అయితే, తమ రెగ్యులర్ కస్టమర్లు కొందరు టీకా తీసుకోని యువకుల నుంచి రక్షణ కల్పిస్తేనే పబ్‌కు వస్తామని చెప్పారని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు జోన్స్ భర్త వివరించారు. తమ ఈ విధానం వివక్షకు సంబంధించినది కాదన్నారు. ఒకవేళ ఎవరైనా అలా భావిస్తే వెంటనే దానిని మారుస్తామని చెప్పారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karnataka HC | ప్రతి విషయాన్ని విచారించే అధికారం ఆ సంస్థకు లేదు.. కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!
girl consumes cough syrup dies | జ్యూస్‌గా భావించి దగ్గు మందు అంతా తాగిన బాలిక.. నిద్రలోకి జారుకుని మృతి
Yogita Rana | విద్యతో ఖైదీల్లో మార్పునకు చర్యలు : విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా
VC Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్యపై చర్యలకు ప్రొఫెసర్లు, విద్యార్థుల డిమాండ్.. వీడియో
Kolkata’s Presidency University | వివేకానంద పోస్టర్‌కు అవమానం.. ఇద్దరు విద్యార్థినులను బహిష్కరించిన యూనివర్సిటీ
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

