టర్కీని కుదిపేసిన భూకంపం.. కుప్పకూలిన భవనాలు.. 95 మంది దుర్మరణం
టర్కీలో భారీ భూకంపం వచ్చింది. సోమవారం తెల్లవారుజామున 4.17 గంటలకు దక్షిణ టర్కీలోని నూర్దాగీ సమీపంలో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.7గా నమోదయిందని జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ (GFZ) తెలిపింది.
రియాద్: భారీ భూకంపం టర్కీని కుదిపేసింది. గజియాన్టెప్ ప్రావిన్స్‌లోని నుర్దగీ సమీపంలో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.8గా నమోదయిందని యూఎస్ జియోగ్రాఫికల్ సర్వీస్ వెల్లడించింది. సోమవారం ఉదయం 4.17 గంటలకు భూమికంపించిందని, నుర్దగీకి 26 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని తెలిపింది. భూమిలోపల 17.9 కిలోమీటర్ల లోతున భూకంపం వచ్చిందని తెలిపింది. భారీ భూకంపం ధాటికి పలు భవనాలు కుప్పకూలిపోయాయి. శిథిలాల కింద చిక్కుకున్నవారిని రక్షించేందుకు అధికారులు, సిబ్బంది ప్రయత్నాలు ముమ్మరం చేశారు. భవనాలు కూలిపోవడంతో ఇప్పటివరకు సుమారు 95 మందివరకు మరణించినట్లు అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు.

టర్కీకి ప్రధానమైన పారిశ్రామిక కేంద్రమైన గజియాన్టెప్.. సిరియా సరిహద్దుల్లో ఉన్నది. భూకంప ప్రభావతంతో లెబనాన్, సిరియా, సైప్రస్‌లో కూడా ప్రకంపనలు సంభవించాయి. సిరియాలోని పశ్చిమ తీరప్రాంతమైన లటకియాలో పలు భవనాలు నేలమట్టమయ్యాయి.

కాగా, 1999లో టర్కీలో 7.4 తీవ్రతతో భూప్రకంపనలు నమోదయ్యాయి. దీంతో 17వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క ఇస్తాంబుల్ నగరంలోనే వెయ్యి మందికిపైగా ప్రజలు మృతిచెందారు. ఇక 2020లో ఎలజిగ్ ప్రాంతంలో 6.8 తీవ్రతతో భూకంపం వచ్చింది. భూకంపం ధాటికి 40 మంది బలయ్యారు. గతేడాది అక్టోబర్‌లో 7.0 తీవ్రతతో వచ్చిన భూకంపంతో 114 మంది మరణించారు. మరో వెయ్యి మందికిపైగా ప్రజలు గాయపడ్డారు.
A Massive 7.8 Magnitude Earthquake has struck Central Turkey within the last hour, Severe Damage and multiple Casualties are being reported across the Region. pic.twitter.com/qILgKNAHMK
— OSINTdefender (@sentdefender) February 6, 2023
Multiple apartment buildings have collapsed after a powerful earthquake in southern Turkey https://t.co/wydrBj94RL
— BNO News (@BNONews) February 6, 2023
BREAKING: First footage is emerging after a M7.8 earthquake in central Turkey.#Turkey #Earthquake
pic.twitter.com/5nJL41NFhO— PolitixBrief UK (@PolitixbriefUK) February 6, 2023
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Cyprus
- Earthquake
- GFZ
- Greece
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

