Philippines | ఫిలిప్పీన్స్ దక్షిణ ప్రాంతాన్ని సోమవారం తెల్లవారుజామున భారీ భూకంపం వణికించింది. రిక్టర్ స్కేలుపై 7.8 తీవ్రతో భూమి కంపించింది. మిండనావో ద్వీపానికి సమీపంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లుగా జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ వెల్లడించింది. భూకంప కేంద్రం భూమికి కేవలం 10 కిలోమీటర్ల లోతులోనే ఉండటంతో తీవ్ర ప్రకంపనలు చోటుచేసుకున్నాయని తెలిపింది. దీని ప్రభావం కారణంగా ఫిలిప్పీన్స్‌తో పాటు ఇండోనేషియా, మలేసియా తదితర దేశాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు.
తీర ప్రాంత ప్రజలు వెంటనే ఎత్తయిన ప్రాంతాలకు తరలిపోవాలని ఫిలిప్పీన్స్ అగ్నిపర్వతాలు, భూకంపాల పరిశోధనా సంస్థ (ఫివోల్క్స్) హెచ్చరించింది. సాధారణ సముద్ర మట్టానికి మీటర్ కంటు ఎక్కువ ఎత్తులో అలలు ఎగిసే అవకాశం ఉందని తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో మూడు కిలోమీటర్ల ఎత్తు వరకు సునామీ అలలు వచ్చే అవకాశం ఉందని పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్ తెలిపింది.
WATCH: Major earthquake brings down building in General Santos City, Philippines pic.twitter.com/AA7pX3rZwa
— Rapid Report (@RapidReport2025) June 8, 2026
సరంగాని ప్రావిన్స్‌లోని మాసిమ్ పట్టణంలో సముద్ర జలాలు కొంత వెనక్కి వెళ్లినట్లు అధికారులు గుర్తించారు. అలాగే అక్కడ ఓ వంతెనకు పగుళ్లు ఏర్పడ్డాయని, భారీ శిలువతో ఉన్న ప్రార్థనా మందిరం కూలిపోయినట్లుగా స్థానిక విపత్తు నిర్వహణ అధికారులు వెల్లడించారు. భూకంపం ప్రభావంతో జనరల్ శాంటో నగరం పరిసర ప్రాంతాల్లోని ఇళ్లలో ఫర్నీచర్, టీవీలు, ఇతర వస్తువులు కిందపడిపోయినట్లుగా స్థానిక మీడియా తెలిపింది. ఈ ప్రకంపనల కారణంగా భయాందోళనకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. సరంగాని ప్రావిన్స్‌లో విద్యుత్, టెలికమ్యూనికేషన్ సేవలకు అంతరాయం ఏర్పడింది. పాఠశాలలకు సెలవు ప్రకటించారు. అయితే ఇప్పటివరకు ప్రాణ నష్టం నమోదైనట్లుగా సమాచారం లేదు. ఆస్తి నష్టంపై అధికారులు అంచనా వేస్తున్నారు.
KUSOG NGA LINOG SA UNANG ADLAW SA KLASE
Read story here: https://t.co/cg8VQk29TS
WATCH: A school building at Matanao National High School (MNHS) in Davao del Sur collapses after a powerful magnitude 7.8 earthquake shakes parts of Mindanao on Monday morning, June 8, coinciding… pic.twitter.com/53qjbTzuO0
— CDN Digital (@cebudailynews) June 8, 2026
భూకంపం, సునామీ హెచ్చరికల నేపథ్యంలో అత్యవసర సహాయక చర్యలకు ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్ ఆదేశాలు జారీ చేశారు. మిండనావో ప్రాంతంలోని ప్రభావిత ప్రాంతాల్లో అన్ని విద్యా సంస్థలకు తదుపరి ఆదేశాలు వచ్చే వరకు సెలవులు ప్రకటించారు. తీర ప్రాంత ప్రజలు ఎలాంటి ఆలస్యం చేయకుండా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని విజ్ఞప్తి చేశారు.
Just awful!
This is just one of the buildings I’ve seen collapse after the M7.8 earthquake in the Philippines. This is in General Santos City…pic.twitter.com/SdOA0HlwON
— Volcaholic 🌋 (@volcaholic1) June 8, 2026