Sharjah | భారతీయ సిబ్బంది ఉన్న చమురు ట్యాంకర్‌పై డ్రోన్ దాడి.. అందరూ సురక్షితం
Sharjah : షార్జా తీరంలో పనామాకు చెందిన ఒక క్రూడాయిల్ ట్యాంకర్‌పై డ్రోన్ దాడి జరిగింది. ఈ దాడిలో నౌకలో ఉన్న 22 మంది భారతీయ సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు.
Sharjah : షార్జా తీరంలో పనామాకు చెందిన ఒక క్రూడాయిల్ ట్యాంకర్‌పై డ్రోన్ దాడి జరిగింది. ఈ దాడిలో నౌకలో ఉన్న 22 మంది భారతీయ సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ వెల్లడించారు. ఎంటీ జీఈఎం నెం.2 అనే చమురు ట్యాంకర్ యూఏఈ, షార్జా తీరంలో లంగరు వేసే ప్రాంతంలో ఉంది. ఈ నౌకలో 22 మంది భారతీయ సిబ్బంది ఉన్నారు. అక్టోబర్ 9న ఈ ట్యాంకర్‌పై డ్రోన్ దాడి జరిగింది.
అయితే, ఈ దాడి ఘటనలో 22 మంది భారతీయ సిబ్బంది సురక్షితంగా ఉన్నారు. ఎవరికీ, ఎలాంటి హానీ కలగలేదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ అంశంపై షిప్ మేనేజ్మెంట్ సంస్థను సంప్రదిస్తున్నామని, భారతీయ సిబ్బంది క్షేమం కోసం తగిన చర్యలు తీసుకుంటున్నామని సోనోవాల్ వివరించారు. ఈ అంశంపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఘటన జరిగిన ప్రాంతం యూఏఈ, దుబాయ్, అరేబియన్ గల్ఫ్ తీరంలో ఉంది. ఈ డ్రోన్ దాడిని ఇండియా, లైబీరియా ఖండించాయి. నల్ల సముద్రంలో వాణిజ్య నౌకలు, నావికా సిబ్బందిపై దాడి జరగడాన్ని తప్పుబట్టాయి.
సముద్ర నౌకల రవాణా, సిబ్బంది భద్రత కోసం అంతర్జాతీయంగా సహకారం, సమన్వయం అవసరం అని ఇండియా, లైబీరియా అభిప్రాయపడ్డాయి. ఈ అంశంపై కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ స్పందించారు. సముద్రంలో వ్యాపారం, వాణిజ్యం నిర్వహించే దేశాలు, నౌక రవాణా దేశాలు, సిబ్బంది ఉన్న దేశాలు కలిసి ఏర్పడ్డ జీఓఎఫ్ ఆన్ ఎస్4 (గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఆన్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ షిప్పింగ్ సీఫేరర్స్) కలిసి నౌకలు, సిబ్బంది రక్షణ కోసం తగిన చర్యలు, ప్రణాళికలు రూపొందించాలని కోరారు. ఇప్పటికే ఈ గ్రూపు తొలి మీటింగ్ న్యూయార్క్‌లో జరగగా.. 25 దేశాల ప్రతినిధులు హాజరయ్యారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sharjah | భారతీయ సిబ్బంది ఉన్న చమురు ట్యాంకర్‌పై డ్రోన్ దాడి.. అందరూ సురక్షితం
Abhijeet Dipke: సీజేపీ నేత అభిజీత్ దీప్కే నానమ్మ మృతి
Gajwel MRO | నువ్వు ఇంకా పురుగుల మందు తాగలేదా..? రైతును ఎమ్మార్వో ఎలా అవహేళన చేశాడో చూడండి.. వీడియో
Supermarket: సూపర్మార్కెట్లో పైకప్పు కూలి 38 మందికి గాయాలు
AP Cabinet | ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

