Pakistan- Kurram Attack | పాకిస్థాన్ కుర్రాం జిల్లాలో కాల్పులు.. 50 మంది మృతి..!
Pakistan- Kurram Attack | పాకిస్థాన్ లోని వాయువ్య జిల్లా కుర్రాంలో ప్యాసింజర్ వాహనాలపై సాయుధ దుండగులు గురువారం జరిపిన కాల్పుల్లో 50 మంది మరణించారు.
Pakistan- Kurram Attack | పాకిస్థాన్ లోని వాయువ్య జిల్లా కుర్రాంలో ప్యాసింజర్ వాహనాలపై సాయుధ దుండగులు గురువారం జరిపిన కాల్పుల్లో 50 మంది మరణించారు. వారిలో మహిళలు, పిల్లలు ఉన్నారు. మరో 29 మందికి గాయాలయ్యాయి. పెషావర్, పరాచినార్ మధ్య వెళుతున్న రెండు కాన్వాయ్లను లక్ష్యంగా చేసుకుని సాయుధులు కాల్పులు జరిపారని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ చీఫ్ సెక్రటరీ నదీం అసియం చౌదరి ఆరోపించారు. ఈ ఘటన అతిపెద్ద విషాదం అని పేర్కొన్నారు.
మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. పోలీసుల ఎస్కార్ట్ తో వస్తున్న రెండు వేర్వేరు కాన్వాయ్ లపై దుండగులు కాల్పులు జరిపారని సీనియర్ అధికారి జావెద్ ఉల్లా మెహ్సూద్ తెలిపారు. సుమారు 10 మంది సాయుధ దుండగులు రోడ్డుకు ఇరువైపులా నిలబడి విచక్షణా రహితంగా కాల్పులు జరిపారన్నారు. పెషావర్ నుంచి పరాచినార్ మధ్య వెళుతున్న కాన్వాయ్ లో తన బంధువులు ఉన్నారని స్థానిక నివాసి జియారాత్ హుస్సేన్ తెలిపాడు. ఈ ఘటనను పాకిస్థాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ ఖండించారు. పౌరులపై హింసను అనుమతించే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.
షియా, సున్నీ ముస్లింల మధ్య సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న భూ వివాదం వల్లే ఇరు పక్షాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. దాడికి పాల్పడిన వారిని పోలీసులు, దర్యాప్తు అధికారులు గుర్తించలేదు. ఏ సంస్థ కూడా తమదే బాధ్యత అని ప్రకటించుకోలేదు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

