అవి చైనా పంపిన నిఘా బెలూన్లే.. నిర్ధారించిన జపాన్ రక్షణ శాఖ
గతంలో తమ గగనతలంపై విహరించిన గుర్తుతెలియని వస్తువులు చైనాకు చెందిన బెలూన్లేనని జపాన్ రక్షణ శాఖ ధృవీకరించింది. నిర్ధిష్ట బెలూన్ ఆకారపు ఎగిరే వస్తువులును విశ్లేషించిన తర్వాత అవి మానవరహిత నిఘా బెలూన్లని, అవి చైనాకు చెందినవేనని తాము నిర్ధారించామని..
టోక్యో: గతంలో తమ గగనతలంపై విహరించిన గుర్తుతెలియని వస్తువులు చైనాకు చెందిన బెలూన్లేనని జపాన్ రక్షణ శాఖ ధృవీకరించింది. నిర్ధిష్ట బెలూన్ ఆకారపు ఎగిరే వస్తువులును విశ్లేషించిన తర్వాత అవి మానవరహిత నిఘా బెలూన్లని, అవి చైనాకు చెందినవేనని తాము నిర్ధారించామని వెల్లడించింది. జపాన్ గగనతలంపై 2019 నవంబర్, 2020 జూన్, 2021 సెప్టెంబర్ నెలలో గుర్తుతెలియన వస్తువు విహరించాయని తెలిపింది.
ఇలా మానవరహిత బెలూన్లతో ఇతర దేశాల్లో నిఘా ఉంచడం, గగనతల ఉల్లంఘనలు ఎంతమేరకు ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వాస్తవాలను బయటపెట్టాలని డ్రాగన్ దేశానికి డిమాండ్ చేసింది. భవిష్యత్తులో ఇలాంటివి మరోసారి పునరావృతం కావొద్దని హెచ్చరించింది.

కాగా, గత పదిరోజుల్లో అమెరికా, కెనడాల్లో నాలుగు నిఘా బెలూన్లను ఆ దేశాల కూల్చివేశాయి. ఈ నెల 4న తమ గగనతలంపై చక్కర్లు కొడుతున్న బెలూన్ను దక్షిణ కరోలీనా తీరానికి దగ్గర్లో అమెరికా వాయుసేన కూల్చివేసింది. ఇక గత శనివారం కూడా అలస్కా తీరంలో 40 వేల అడుగుల ఎత్తులో పేలోడ్లతో ఉన్న ఓ వాహనం ప్రయాణిస్తున్నట్లు అమెరికా అధికారులు గుర్తించారు. వెంటనే దానిని కూల్చివేశారు. ఈ వస్తువు గురువారమే తమ గగనతలంలోకి ప్రవేశించినట్లు పెంటగాన్ అధికారులు వెల్లడించారు.
ఇక ఈ నెల 12న కెనడా గగనతలంలో కూడా అనుమానాస్పద వస్తువును అధికారులు గుర్తించారు. అమెరికా-కెనడా సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టాయి. దానిని అమెరికాకు చెందిన ఎఫ్-22 ఫైటర్ జెట్ ఆ వస్తువును పేల్చేసింది. ఇక రెండురోజుల క్రితం అగ్రరాజ్యంలోని మిషిగన్ రాష్ట్రంలో ఉన్న హురాన్ సరస్సు ప్రాంతంలో.. 20 వేల అడుగుల ఎత్తులో స్థూపాకార వస్తువు ప్రయాణిస్తున్నట్లు గుర్తించారు. దానిని ఎఫ్-16 ఫైటర్ జెట్ ఏఐఎం 9ఎక్స్ ద్వారా కూల్చివేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

