బాలిస్టిక్ మిస్సైళ్లను పరీక్షించిన నార్త్ కొరియా.. ద్రువీకరించిన అమెరికా, జపాన్

ప్యోంగ్యాంగ్: ఉత్తర కొరియా రెండు బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించింది. జపాన్ సముద్ర జలాల్లో ఆ మిస్సైళ్ల టెస్ట్ జరిగినట్లు అమెరికాతో పాటు జపాన్ వెల్లడించింది. నిజానికి బాలిస్టిక్ మిస్సైళ్లను పరీక్షించవద్దన్న ఆంక్షలు ఉత్తర కొరియాపై ఉన్నాయి. కానీ ఆ నిషేధ ఆజ్ఞలను నార్త్ కొరియా ఉల్లంఘించినట్లు తెలుస్తోంది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాలను నార్త్ కొరియా బేఖాతరు చేసింది. ఉత్తర కొరియా చేపట్టిన మిస్సైల్ పరీక్షలను జపాన్, దక్షిణ కొరియా దేశాలు ఖండించాయి. క్షిపణలకు చెందిన శిథిలాల తమ జలాల్లో పడలేదని జపాన్ పేర్కొన్నది. ఉత్తర కొరియా అక్రమ రీతిలో బాలిస్టిక్ క్షిపణులను సమీకరిస్తున్నదని, దీని వల్ల సమీప దేశాలకు సమస్యలు తలెత్తుతాయని యూఎస్ పసిఫిక్ కమాండ్ పేర్కొన్నది. అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఉత్తర కొరియా క్షిపణులను పరీక్షించడం ఇదే మొదటిసారి. అయితే బాలిస్టిక్ మిస్సైళ్లను ఉత్తర కొరియా పరీక్షించడం పట్ల ఆందోళన వ్యక్తం అవుతున్నది. యూఎన్ భద్రతా మండలి ఆ క్షిపణుల పరీక్షలను నిషేధించింది. వీటిని టెస్ట్ చేయవద్దు అని కిమ్, ట్రంప్ మధ్య 2018లో ఓ ఒప్పందం కూడా జరిగింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

