Nithyananda | అమెరికాకు నిత్యానంద బురిడీ.. కైలాసం దేశం పేరుతో 30కి పైగా నగరాలతో ఒప్పందాలు
Nithyananda | తనకు తాను దైవస్వరూపంగా ప్రకటించుకొన్న నిత్యానంద అమెరికాలోని దాదాపు 30కి పైగా నగరాలను బురిడీ కొట్టించాడు. ఆయా నగరాలతో తన కల్పిత దేశమైన ‘యునైడెట్ స్టేట్స్ ఆఫ్ కైలాస’ పేరుతో సాంస్కృతిక భాగస్వామ్య ఒప్పందాలు చేసుకొన్నాడని అమెరికా మీడియా సంస్థ ఫాక్స్‌న్యూస్ తాజాగా వెల్లడించింది.
Nithyananda | న్యూయార్క్, మార్చి 18: తనకు తాను దైవస్వరూపంగా ప్రకటించుకొన్న నిత్యానంద అమెరికాలోని దాదాపు 30కి పైగా నగరాలను బురిడీ కొట్టించాడు. ఆయా నగరాలతో తన కల్పిత దేశమైన ‘యునైడెట్ స్టేట్స్ ఆఫ్ కైలాస’ పేరుతో సాంస్కృతిక భాగస్వామ్య ఒప్పందాలు చేసుకొన్నాడని అమెరికా మీడియా సంస్థ ఫాక్స్‌న్యూస్ తాజాగా వెల్లడించింది.
‘సిస్టర్ సిటీ’ పేరుతో చేసుకొన్న ఈ ఒప్పందాలపై అమెరికాకు చెందిన 30 నగరాల ప్రతినిధులు సంతకాలు చేసినట్టు కైలాస వెబ్సైట్లో ఉన్నదని పేర్కొన్నది. కల్పిత దేశం కైలాసతో సిస్టర్ సిటీ ఒప్పందాన్ని రద్దు చేసుకొంటున్నట్టు న్యూజెర్సీలోని నెవార్క్ నగరం ప్రకటించిన నేపథ్యంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. నెవార్క్ నగరం, కల్పిత యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస మధ్య ఈ ఏడాది జనవరి 12న సిటీ హాల్ వేదికగా ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందాలు చేసుకొన్న నగరాల జాబితాలో రిచ్మండ్, వర్జీనియా, డాటన్, ఓహియో, ప్లోరిడా వంటి నగరాలు ఉన్నాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

