Pakistan navy helicopter crash | కూలిన పాకిస్థాన్ నేవీ హెలికాప్టర్.. ముగ్గురు సిబ్బంది మృతి
Pakistan navy helicopter crash | పాకిస్థాన్‌కు చెందిన నేవీ హెలికాప్టర్ కూలిపోయింది. (Pakistan navy helicopter crash) ఈ ప్రమాదంలో అందులో ఉన్న ముగ్గురు సిబ్బంది మరణించారు. పాకిస్థాన్‌లో దశాబ్దాలుగా కొనసాగుతున్న తిరుగుబాటు ప్రాంతమైన బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో ఈ సంఘటన జరిగింది.
ఇస్లామాబాద్: పాకిస్థాన్‌కు చెందిన నేవీ హెలికాప్టర్ కూలిపోయింది. (Pakistan navy helicopter crash) ఈ ప్రమాదంలో అందులో ఉన్న ముగ్గురు సిబ్బంది మరణించారు. పాకిస్థాన్‌లో దశాబ్దాలుగా కొనసాగుతున్న తిరుగుబాటు ప్రాంతమైన బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో ఈ సంఘటన జరిగింది. చైనా అభివృద్ధి చేస్తున్న ఓడ రేపు నగరమైన గ్వాదర్‌లో టేకాఫ్ అయిన నేవీ శిక్షణ హెలికాప్టర్ సోమవారం ఉదయం 10 గంటలకు కూలిపోయింది. అందులో ఉన్న ఇద్దరు నేవీ అధికారులు, మరో సిబ్బంది చనిపోయినట్లు పాకిస్థాన్ నేవీ ప్రతినిధి తెలిపారు. సాంకేతిక సమస్య వల్ల ఆ హెలికాప్టర్ కూలిపోయి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు.
కాగా, పాకిస్థాన్ నేవీ హెలికాప్టర్ కూలడానికి ముందు దాని ఇంజిన్‌లో మంటలు చెలరేగినట్లు కొందరు స్థానికులు తెలిపారు. ఈ నేపథ్యంలో బలూచిస్థాన్ వేర్పాటువాదులు దానిని కూల్చి ఉంటారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. గత ఏడాది సెప్టెంబర్‌లో ఆ ప్రావిన్స్‌లోని ఖోస్ట్ ప్రాంతంలో ఆర్మీ హెలికాప్టర్ కూలింది. అందులో ప్రయాణించిన ఆరుగురు ఆర్మీ సిబ్బంది ఆ ప్రమాదంలో మరణించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

