వాషింగ్టన్: వాణిజ్యపరమైన సూపర్సానిక్ విమానాలు సాధ్యమేనని రుజువు చేయడానికి నాసా (నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్), లాక్హీడ్ మార్టిన్ స్కంక్ వర్క్స్ సంయుక్తంగా కృషి చేస్తున్నాయి. ఎక్స్-59 క్వైట్ సూపర్సానిక్ ఎయిర్క్రాఫ్ట్ గురించి నాసా అధికారికంగా శుక్రవారం వెల్లడించింది.
ఇది శబ్ద వేగాన్ని మించిన వేగంతో ప్రయాణిస్తుందని, అంతేకాకుండా, దీని నుంచి శబ్దం వెలువడదని తెలిపింది. ఈ ప్రయోగాత్మక విమానం డేటాను సేకరిస్తుందని తెలిపింది. దీనిని త్వరలోనే ప్రారంభించి, ఆ తర్వాత మొదటి నిశబ్ద సూపర్సానిక్ విమాన ప్రయాణాన్ని ప్రారంభిస్తామని చెప్పింది. కాలిఫోర్నియాలోని లాక్హీడ్ మార్టిన్ కంపెనీ ప్రాంగణంలో ఈ విమానాన్ని ప్రదర్శించారు.