Sheep Heads | ఈజిప్ట్ ఆలయం కింద.. బయటపడిన వేలాది గొర్రెల తలలు
Sheep Heads | ఒక ఆలయం కింద సుమారు రెండు వేలకు పైగా గొర్రె తలల (Sheep Heads) మమ్మీలు బయటపడ్డాయి. ఈజిప్ట్ పర్యాటక, పురాతన వస్తువుల మంత్రిత్వ శాఖ ఆదివారం ఈ విషయం తెలిపింది. ఫారో రామ్సెస్ II ఆలయంలో నైవేద్యంగా ఉంచిన మమ్మీ చేసిన గొర్రెల తలలను పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నట్లు పేర్కొంది.
కైరో: మమ్మీలకు ప్రసిద్ధి చెందిన ఈజిప్ట్‌లో చేపట్టిన తవ్వకాల్లో కొత్త వాటిని గుర్తించారు. ఒక ఆలయం కింద సుమారు రెండు వేలకు పైగా గొర్రె తలల (Sheep Heads) మమ్మీలు బయటపడ్డాయి. ఈజిప్ట్ పర్యాటక, పురాతన వస్తువుల మంత్రిత్వ శాఖ ఆదివారం ఈ విషయం తెలిపింది. ఫారో రామ్సెస్ II ఆలయంలో నైవేద్యంగా ఉంచిన మమ్మీ చేసిన గొర్రెల తలలను పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నట్లు పేర్కొంది. దక్షిణ ఈజిప్టులోని దేవాలయాలు, సమాధులకు ప్రసిద్ధి చెందిన అబిడోస్ వద్ద అమెరికాకు చెందిన పురావస్తు శాస్త్రజ్ఞుల బృందం వీటిని వెలికి తీసినట్లు పేర్కొంది. కుక్కలు, మేకలు, ఆవులు, గజెల్స్, ముంగిస మమ్మీలు కూడా తవ్వకాల్లో బయటపడినట్లు వెల్లడించింది.
కాగా, క్రీస్తు పూర్వం 1304 నుంచి 1237 వరకు దాదాపు ఏడు దశాబ్దాల పాటు ఈజిప్టును రామ్సెస్ II పాలించారు. ఆయన మరణాంతరం వెయ్యి ఏళ్ల తర్వాత జరిగిన ఆరాధన ఉత్సవాల్లో భాగంగా వేల సంఖ్యలో గొర్రెలు, మేకలు, ఆవులు, కుక్కలు వంటి జంతువులను బలి ఇచ్చి నైవేద్యం కోసం మమ్మీలుగా చేసి ఉంటారని అమెరికన్ మిషన్ అధిపతి సమేహ్ ఇస్కందర్ తెలిపారు. మమ్మీలుగా చేసిన జంతువుల అవశేషాలతోపాటు సుమారు 4,000 సంవత్సరాలు కిందట నిర్మించిన ఐదు మీటర్ల మందం (16 అడుగుల) గోడలతో కూడిన ప్యాలెస్ శిథిలాలు, అనేక విగ్రహాలు, పాపిరి, పురాతన చెట్ల అవశేషాలు, తోలు బట్టలు, బూట్లు వంటి వాటిని కూడా కనుగొన్నట్లు చెప్పారు.
మరోవైపు 2374 నుంచి 2140 బీసీ మధ్య, 323 నుంచి 30 బీసీ నాటి టోలెమిక్ కాలం నాటి నిర్మాణాలు, రామ్సెస్ II ఆలయం, అక్కడ జరిగిన కార్యకలాపాల గురించి మరింత తెలుసుకునేందుకు ఈ ఆవిష్కరణలు సహాయపడతాయని ఈజిప్ట్‌లోని పురాతన పురాతన వస్తువుల సుప్రీం కౌన్సిల్ అధిపతి మోస్తఫా వాజిరి తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

