France Riots: పారిస్‌లో 350 మందికిపైగా అరెస్టు.. అల్లర్లను నియంత్రించలేకపోయామన్న మంత్రి
France Riots: ఫ్రాన్స్‌లో ఆదివారం లూటీలకు పాల్పడి, హింసకు దిగిన వారిని అరెస్టు చేశారు. పారిస్‌లో సుమారు 350 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఆందోళనలను నియంత్రించలేకపోయినట్లు హోంమంత్రి నునేజ్ తెలిపారు. స్కూళ్లు సరిగా లేవని, జీవన వ్యయం భారంగా మారినట్లు ఆందోళనకారులు పేర్కొన్నారు.
పారిస్: ఫ్రాన్స్‌లో ఆదివారం జరిగిన విధ్వంసం(France Riots).. ఆ దేశ చరిత్రలో చేదు గుర్తుగా మిగిలిపోయింది. అయితే పారిస్‌లో ఇప్పటి వరకు సుమారు 350 మంది నిరసనకారుల్ని అరెస్టు చేశారు. పారిస్‌తో పాటు ఇతర నగరాల్లో జరిగిన నిరసన ప్రదర్శన వేళ.. ఆందోళనకారుల్ని పోలీసులు నియంత్రించలేకపోయినట్లు హోంమంత్రి లారెంట్ నునేజ్ తెలిపారు. అల్లర్లు, హింసను అంచనా వేయలేకపోయినట్లు ఆయన చెప్పారు. ఆదివారం జరిగిన హింస నేపథ్యంలో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. కానీ మాక్రన్ ఆ రాజీనామాను అంగీకరించలేదని తెలిసింది.
దేశవ్యాప్తంగా పాఠశాల్లో అద్వాన్న పరిస్థితులు ఉన్నాయని, పెరిగే ధరల వల్ల రోజువారీ బ్రతుకు జీవనం కఠినంగా సాగుతున్నట్లు గత కొన్ని రోజుల నుంచి ఫ్రాన్స్‌లో ఆందోళనలు జరుగుతున్నాయి. అయితే వారాంతం వేళ సుమారు అయిదున్నర లక్షల మంది వరకు భారీ నిరసన ప్రదర్శనకు పిలుపునిచ్చారు. ఫ్రాన్స్‌లోని ముఖ్యమైన నగరాల్లో ఆ ఆందోళనలు జరిగాయి. కొందరు నిరసనకారులు విధ్వంసానికి దిగారు. సుమారు 1500 షాపులను, వ్యాపార కేంద్రాలను లూటీ చేసి ధ్వంసం చేశారు.
వాస్తవానికి సెప్టెంబర్‌లో విద్యా ప్రమాణాలు పెంచాలని విద్యార్థులు ఆందోళనలు చేపట్టారు. స్కూల్ బిల్డింగ్లు క్షీణదశలో ఉన్నాయని, టీచర్ల కొరత ఉన్నట్లు విద్యార్థులు ఆరోపించారు. అన్ని నగరాలకు ఆ ఆందోళన పాకింది. కొన్ని చోట్ల హింసకు దారి తీసింది. అక్టోబర్ 5వ తేదీన జరిగిన నిరసనలో 15 ఏళ్ల విద్యార్థి చేయికి తీవ్రగాయమైంది. టీచర్లు, పెన్షనర్లు, వివిధ సంఘాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టాయి. తొలుత ఆందోళనలు శాంతియుతంగా సాగాయి. కానీ ఆ తర్వాత కాస్త వేడెక్కాయి.
మరోవైపు ఫ్రాన్స్‌లో దేశాధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్నాయి. మరో ఆరు నెలల్లో కొత్త ప్రభుత్వం ఏర్పడనున్నది. వచ్చే మే నెలలో జరిగే ఎన్నికల కోసం ఫ్రాన్స్ వీధుల్లోనే ప్రచారం మొదలైనట్లు కొందరు ఆరోపిస్తున్నారు. కానీ ఆదివారం జరిగిన ఘటన పట్ల మంత్రి లారెంట్ నునేజ్ కారణం వెల్లడించే ప్రయత్నం చేశారు. హింసకు బాధ్యుడిగా భావిస్తూ రాజీనామా చేసినట్లు చెప్పారు. కానీ ఆ రాజీనామాను మాక్రన్ తిరస్కరించినట్లు ఎలిసీ ప్యాలెస్ వర్గాలు పేర్కొన్నాయి. సుమారు 2 లక్షల మంది వరకు నిరసనల్లో పాల్గొంటారని అంచనా వేశామని, కానీ ఆ సంఖ్య 5 లక్షలు దాటిందని నునేజ్ అన్నారు. తాము తీసుకున్న భద్రతా చర్యలు సరిపోలేదన్నారు.
పారిస్, లియాన్, మారిసెల్లీలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయలేకపోయినట్లు ఆ నగరాల మేయర్లు తెలిపారు. లూటీలు ఎందుకు జరిగాయో అర్థం కావడం లేదని, సుమారు 30 నిమిషాల పాటు లూటీ జరుగుతుంటే పోలీసులు ఏమీ చేయలేకపోయినట్లు మేయర్లు ఆరోపించారు. సమస్య పరిష్కారానికి హై స్కూల్ విద్యార్థులతో మీటింగ్ నిర్వహించాలని మేయర్లు అభిప్రాయపడ్డారు. జనసమీకరణపై మారిసెల్లిలో ప్రస్తుతం తాత్కాలిక బ్యాన్ విధించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

