Mohammad Abbas: నాడు భారత మిలిటరీ అకాడమీలో శిక్షణ.. నేడు అఫ్ఘన్‌లో తాలిబన్ అగ్రనేత.. ఎవరతను?
Mohammad Abbas Stanikzai | తాలిబన్ల అగ్రనేతగా ఉన్న షేర్ మొహమ్మద్ అబ్బాస్ స్టానిక్జాయ్ ఒకప్పుడు డెహ్రాడూన్‌లోని ఇండియన్ మిలిటరీ అకాడమీలో శిక్షణ పొందాడు. 1982లో ఆఫ్ఘన్ సైన్యం తరపున అతను శిక్షణ తీసుకున్నాడు.

న్యూఢిల్లీ: తాలిబన్ల అగ్రనేతగా ఉన్న షేర్ మొహమ్మద్ అబ్బాస్ స్టానిక్జాయ్ ( Mohammad Abbas Stanikzai ) ఒకప్పుడు డెహ్రాడూన్‌లోని ఇండియన్ మిలిటరీ అకాడమీలో శిక్షణ పొందాడు. 1982లో ఆఫ్ఘన్ సైన్యం తరపున అతను శిక్షణ తీసుకున్నాడు. అప్పుడు అతని బ్యాచ్‌మేట్స్ అబ్బాస్‌ను షేరూ అని పిలిచేవారు. ప్రస్తుతం తాలిబన ఉగ్ర సంస్థను నడిపిస్తున్న ఏడుగురిలో షేరూ ఒకరు. ఇండియాలోనై సైనిక శిక్షణ పొందిన అబ్బాస్ గురించి అతని బ్యాచ్‌మేట్స్ ఆసక్తికర విషయాలు చెప్పారు. స్టానిక్జాయ్ శారీరకంగా దృఢంగా ఉండేవాడని, మతపరమైన భావాలు ఎక్కువగా ఉండేవి కావని, 20 ఏళ్ల వయసులో అతను శిక్షణ కోసం వచ్చాడని, అతనితో పాటు 45 మంది విదేశీయులు ఇండియన్ మిలిటరీ అకాడమీలో ట్రైనింగ్ తీసుకున్నట్లు ఓ కథనం ద్వారా తెలుస్తోంది.
అకాడమీలో షేరూ కొంత వయసు ఎక్కువ ఉన్న వ్యక్తిగా కనబడేవాడు, మీసాలతో అట్రాక్ట్ చేసేవాడని, ఆ సమయంలో అతనికి విప్లవ భావాలు లేవని, అతనో సగటు ఆఫ్ఘన్ క్యాడెట్ అని, ఆనాటి బ్యాచ్మేటి మేజర్ జనరల్ ఏడీ చతుర్వేది తెలిపారు. షేరూతో బ్యాచ్‌మేట్‌గా ఉన్న కల్నల్ కీసర్ సింగ్ షెకావత్ కూడా ఆ రోజుల్ని గుర్తుచేసుకున్నాడు. డెహ్రాడూన్‌లో ప్రతి వారం చివరల్లో నది ప్రాంతానికి ట్రిప్‌కు వెళ్లేవాళ్లమని కల్నల్ కీసర్ తెలిపారు. అబ్బాస్‌తో కలిసి రిషికేశ్కు వెళ్లి గంగా నదిలో స్నానం చేసినట్లు ఆయన చెప్పారు.
1996లో అబ్బాస్ స్టానిక్జాయ్.. ఆఫ్ఘనిస్తాన్ ఆర్మీకి గుడ్‌బై చెప్పాడు. ఆ తర్వాత అతను తాలిబన్లో చేరాడు. అయితే తాలిబన్లకు దౌత్యపరమైన హోదా ఇవ్వాలంటూ ఆయన వాషింగ్టన్కు వెళ్లి క్లింటన్‌ను వేడుకున్నారు. కానీ అతని ప్రయత్నాలు ఫలించలేదు. ఆఫ్ఘన్ ప్రభుత్వంతో చర్చలు జరిపిన అబ్దుల్ హకిమ్ హక్కానీ గ్రూపుకు మధ్యవర్తిగా కూడా చేశాడు. షేరూకు ఆంగ్ల భాషపై పట్టు బాగా ఉంది. మిలిటరీ శిక్షణలోనూ అతను ఆరితేరిపోయాడు. ఆ అనుభవంతోనే అతను ఇప్పుడు తాలిబన్లలో కీలక సభ్యుడిగా ఎదిగాడు. 2015లో ఖతార్‌లోని తాలిబన్ పొలిటికల్ ఆఫీసు అధిపతిగా అతను నియమితుయ్యాడు.
ఇవి కూడా చదవండి..
US Big mistakes in Afghan | ఆఫ్ఘన్లో అమెరికా 5 పెద్ద పొరపాట్లు ఇవే!
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Child Marriage | టెంకంపేట్లో బాల్యవివాహానికి బ్రేక్.. అధికారుల చొరవతో నిలిపివేత
Begumpet Students | సిద్దిపేట వైజ్ఞానిక ప్రదర్శనలో బేగంపేట విద్యార్థుల ప్రతిభ.. రాష్ట్రస్థాయికి స్మార్ట్ వాకర్ ప్రాజెక్టు
Myanmar military bombs school | స్కూల్‌పై మయన్మార్ ఆర్మీ బాంబు దాడి.. మహిళలు, పిల్లలతో సహా 30 మంది మృతి
ఓబీసీ కులగణన తర్వాతే డీలిమిటేషన్ చేపట్టాలి.. బీసీ మహిళలకు సబ్‌కోటా కల్పించాలి.. జాజుల శ్రీనివాస్ డిమాండ్
IAS Transfers | రాష్ట్రంలో మరోసారి ఐఏఎస్‌ల బదిలీలు.. కీలక శాఖల్లో కొత్త నియామకాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

