ఫైజర్, ఆస్ట్రాజెనికా మిక్సింగ్‌తో అదిరిపోయే ఇమ్యూనిటీ

లండన్: కోవిడ్ వ్యాక్సిన్ మిక్సింగ్ గురించి పరిశోధనలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే దీనికి సంబంధించిన ఓ తాజా విషయాన్ని లాన్సెట్ మెడికల్ జర్నల్ అప్డేట్ చేసింది. ఫైజర్‌తో పాటు ఆస్ట్రాజెనికా టీకాను వేసుకుంటే.. దాని ద్వారా బోలడంత ఇమ్యూనిటీ వస్తుందని తేలింది. ఆక్స్ఫర్డ్ వర్సిటీ స్టడీలో ఈ విషయం స్పష్టమైంది. అయితే ఫైజర్, ఆస్ట్రా టీకాలను కనీసం నాలుగు వారాల తేడాతో ఇస్తే, దాని వల్ల యాంటీబాడీల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. నిజానికి ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం టీకాల కొరత ఉన్నది. వ్యాక్సిన్ల సరఫరాను పెంచేందుకు అన్ని రకాల ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. తొలి, రెండవ డోసుల మధ్య వ్యవధిని పెంచే ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. అయితే రెండు రకాల టీకాలను మిక్స్ చేయడం వల్ల.. కొంత వరకు సమస్య తీరే అవకాశాలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
మొదటి ఫైజర్ టీకా తీసుకుని, ఆ తర్వాత రెండవ డోసుగా ఆస్ట్రాజెనికా టీకా తీసుకున్నవారిలో యాంటీబాడీల సంఖ్య విపరీతంగా పెరిగినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఒకవేళ ముందుగా ఆస్ట్రాజెనికా టీకా తీసుకుంటే, ఆ తర్వాత రెండవ డోసుగా ఫైజర్ టీకాను వేసుకుంటే, దాని ద్వారా అత్యధిక సంఖ్యలో టీ-కణాలు ఉత్పత్తి అయినట్లు శాస్త్రవేత్తలు తేల్చారు. వ్యాక్సిన్ మిక్సింగ్ వల్ల రెండు డోసుల ఆస్ట్రాజెనికా కన్నా అధిక స్థాయిలో యాంటీబాడీలు ఉత్పత్తి అయినట్లు పేర్కొన్నారు. రెండు వేర్వేరు టీకాలను వేసుకోవడం వల్ల ఆప్షన్లు పెరుగుతాయని ఆక్స్ఫర్డ్ ప్రొఫెసర్ మాథ్యూ స్నేప్ తెలిపారు.
ప్రస్తుతం ఆస్ట్రాజెనికా టీకాలను బ్రిటన్‌లో 12 వారాల వ్యవధిలో ఇస్తున్నారు. దీని వల్ల వ్యాక్సిన్ సామర్థ్యం పెరుగుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కొత్తగా ప్రతిపాదించిన స్టడీ మరో విషయాన్ని తేల్చింది. ఒకవేళ రెండు డోసుల మద్య పది నెలల తేడా ఉంటే.. అప్పుడు ఆ టీకాల వల్ల ఇమ్యూనిటీ ఇంకా ఎక్కువగా ఉంటుందని ఆక్స్ఫర్డ్ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అయితే 12 వారాల తేడాతో ఇస్తున్న రెండు వేర్వేరు వ్యాక్సిన్లకు సంబంధించిన ఫలితాలు మరో రెండు నెలల్లో రానున్నట్లు మాథ్యూ స్నేప్ తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

