ట్రంప్ ఫేస్బుక్, ఇన్‌స్టా ఖాతాల పునరుద్ధరణ.. రెండేండ్ల తర్వాత నిషేధం ఎత్తివేత
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఉన్న నిషేధాన్ని ప్రముఖ సామాజిక మాధ్యమాలైన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఎత్తివేశాయి. 2021లో యూఎస్ క్యాపిటల్‌పై జరిగిన దాడి తర్వాత ఆయనను బ్యాన్
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఉన్న నిషేధాన్ని ప్రముఖ సామాజిక మాధ్యమాలైన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఎత్తివేశాయి. 2021లో యూఎస్ క్యాపిటల్‌పై జరిగిన దాడి తర్వాత ఆయనను బ్యాన్ చేశాయి. అయితే రెండేండ్ల తర్వాత ఆయన అకౌంట్లను పునరుద్ధరిస్తున్నట్లు ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ల మాతృసంస్థ మెటా ప్రకటించింది. ప్రజలు ఇకపై తమ రాజకీయ నాయకులు ఏం చెబుతున్నారో వినవచ్చు. అది మంచైనా, చెడైనా అంటూ బ్లాగ్ స్పాట్ వేదికగా వెల్లడించింది. ప్రజలు బ్యాలట్ బ్యాక్స్ ద్వారా తమ చాయిస్‌ను తెలపొచ్చని పేర్కొన్నది.
2021లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఓటమి అనంతరం దేశంలో పెద్దఎత్తున హింసాకాండ చెలరేగింది. ఆయన మద్దతుదారులు యూఎస్ క్యాపిటల్ భవనంలోకి దూసుకెళ్లి విధ్వంసం సృష్టించారు. వారి రెచ్చగొట్టే విధంగా ట్రంప్ వ్యవహరించారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈనేపథ్యంలో ట్రంప్ ఖాతాలను తొలగిస్తున్నట్టు ఫేస్బుక్, ఇన్‌స్టాతోపాటు ట్విట్టర్ ప్రకటించాయి. అయితే గత నవంబర్లోనే ట్రంప్.. ట్విట్టర్లోకి మళ్లీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

